ఏపీలో బీజేపీ పాగా వేయాల‌ని ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది. అయితే, క్షేత్ర‌స్థాయిలో పార్టీకి బ‌లం లేదు.. దీంతో పాటు ఒంటరిగా పోటీ చేసి గెలిచేంత బ‌ల‌గం లేక‌పోయినా.. 2024 ఎన్నిక‌ల్లో తప్ప‌కుండా గెలుస్తామ‌ని  ధీమా వ్య‌క్తం చేస్తోంది ఏపీ క‌మ‌ల‌నాధులు. ఇదే ధీమాతో ప్ర‌జాక‌ర్ష‌క ప‌థ‌కాల ప్ర‌క‌టించ‌డం మొద‌లు పెట్టిన‌ట్టుగా క‌నిపిస్తోంది. ఇందులో భాగంగానే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బీజేపీ అధికారంలోకి వ‌స్తే  త‌క్కువ ధ‌ర‌కే చీప్ లిక్క‌ర్ అందిస్తామ‌ని ఆ పార్టీ రాష్ట్ర నాయ‌కుడు సోము వీర్రాజు ప్ర‌క‌టించ‌డం వైర‌ల్ గా మారింది. దీంతో బీజేపీ ప‌రువు పోయినంత ప‌ని అయిపోయింది. ఏపీ కాషాయ నాయ‌కుడి చీఫ్ లిక్క‌ర్ వ్యాఖ్య‌లు తెలంగాణ‌లో కిక్కెక్కించాయి. సోము వీర్రాజు ప్ర‌క‌ట‌న‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేస్తూ ట్విట్ట‌ర్ వేధిక‌గా పోస్ట్ చేశారు.


 అయితే, ఈ వ్యాఖ్య‌లు బీజేపీకి న‌ష్టం చూకూర్చినా పార్టీ వార్త‌ల్లో నిలిచింద‌ని సోము వీర్రాజు మ‌న‌శ్శాంతిగ ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇదే క్ర‌మంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బ‌ల‌మైన సామాజిక వ‌ర్గం అయిన కాపుల మ‌ద్ధ‌తు కోసం ఒక అధికార వైసీపీ, మ‌రోవైపు తెలుగు దేశం తీవ్ర ప్ర‌య‌త్నాల‌ను మొద‌లు పెట్టింది. ఈ క్ర‌మంలో బీజేపీ కూడా కాపుల‌ను త‌మ వైపు తిప్పుకోవ‌డానికి దృష్టి సారించింది. జ‌న‌సేన‌తో పొత్తు ఉండ‌బోద‌నే సంకేతాల నేప‌థ్యంలో కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌ల‌ను, నాయ‌కుల‌ను పార్టీలో చేర్చ‌కునేందుకు బీజేపీ పావులు క‌దుపుతోంది.



ఇందులో భాగంగానే కాపు సామాజిక వ‌ర్గం నేత‌ల‌తో బీజేపీ స‌మావేశాలు నిర్వ‌హించింది. సామాజిక స‌మీక‌ర‌ణ‌లు, ప్ర‌జాక‌ర్ష‌న ప‌థ‌కాలు తీసుకువ‌స్తామ‌ని ప్ర‌క‌ట‌న‌లు చేసినా ఏపీలో బీజేపీ అధికారంలోకి రాబోద‌నే స‌త్యాన్ని తెలుసుకోవాల‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.     అయితే, ఇలాంటి ఓట్ల రాజ‌కీయం కోసం కాషాయ నేత‌లు పావులు క‌దుపుతున్నారు.. కానీ, అస‌లు రాష్ట్రంలో పార్టీ నిర్మాణం స‌రిగ్గా లేద‌ని.. ముందు క్షేత్ర‌స్థాయిలో పార్టీ నిర్మాణంపై దృష్టి సారించాల‌నే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి:

BJP