భారత్ లో తొలిసారిగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న యుద్ద నౌక ఐఏసి విక్రాంత్ భారత అమ్మల పొదిలో కీలకం కానుంది. ఈ యుద్ద నౌక తీరు తెన్నులను భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయడుు స్వయంగా పరిశీలించారు. ఏంటి ప్రత్యేకత ?
 కేరళ పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి కొచ్చి షిప్ యార్డును సందర్శించారు. పలు కార్యక్రమాల్లో పాల్గోన్నారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా రూపుదిద్దుకున్న యుద్ద నౌకను సందర్శించారు. దాని పనితీరును  అడిగి తెలుసుకున్నారు. ఐఏసి విక్రాంత్ ప్రత్యేకతలను  అక్కడి నావికాదళ అధికారులు ఉపరాష్ట్రపతికి వివరించారు. గతంలో భారత దేశం  యుద్ద సామగ్రిని విదేశాల నుంచి దిగుమతి చేసుకునేదని, ప్రస్తుతం విదేశాలకు ఎగుమతి చేసుకునే స్థాయికి ఎదిగామని ఉప రాష్ట్రపతి పెర్కోన్నారు. భారత్ ఎప్పుడూ శాంతిని కోరుకుంటుందని పునరుద్ఘాటించారు. మేక్ ఇన్ ఇండియా  అనేది  భారత్ కు స్పూర్తి దాయకమైనదని ఆయన ప్రశంసించారు. భారత్ స్వయంగా యుద్ధనౌకలను తయారు చేయడం ప్రతి భారతీయునికి గర్వకారణమని పేర్కోన్నారు.ఆ తరువాత ఆయన నావల్ ఫిజికల్ అండ్ ఓషనోగ్రాఫిక్ లోబొరెటరీ 70 వ వార్షికోత్సవాలకు హాజరయ్యారు. మాజీ రాష్ట్రపతి , భారత రత్న అబ్దుల్ కలామ్ స్మారక స్థూపాన్ని ఆవిష్కరించారు. భారత యుద్ద నౌకలను పరిశీలించిన మొట్టమొదటి ఉపరాష్ట్రతి వెంకయ్య నాయుడే కావడం గమనార్హం. ఉప రాష్ట్రపతి వెంట కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్, సదరన్ నావల్ కమాండెంట్ ఆంటోనీ జార్జి తదితరులు ఉన్నారు.
తన పర్యటనలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కాస్త తీరిక చేసుకుని భార్య ఉషమ్మతో కలసి లక్షద్వీప్ బీచ్ లో కాసేపు  వాకింగ్ చేశారు.  అక్కడి  ప్రకృతి అందాలకు మైమరచారు. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ  ఆసేతు హిమాచలం ఉన్న పర్యాటక స్థలాలను సందర్శించాలని పిలుపునిచ్చారు. అక్కడి చారిత్రక విశేషాలను, అందాలను ఆస్వాదించాలని పిలుపునిచ్చారు. అంతేకాదండోయ్ పర్యావరణ స్పృహతో వ్యవహరించాలని కూడా ఆయన తనదైన శైలిలో హెచ్చరించారు. పర్యటనలు చేసే మిత్రులంతా స్థానికుల మంచి చెడ్డలను గుర్తేరిగి మసలుకోవాలని తెలిపారు. పర్యావరణం పై కనీస పరిజ్ఞానం పెంచుకుంటే మాన వాళికి మంచి జరుగుతుందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: