రైతుకు సాయం చేసే దిశగా ఏటా ఇచ్చే ఆర్థిక ఆలంబనలో భాగంగా ఇవాళ వైఎస్ జగన్ తనవంతు బాధ్యతను ప్రధాని అందించిన కేంద్ర నిధులతో కలుపుకుని నిర్వర్తించారు.వాస్తవానికి ఈ పథకాన్ని అక్టోబర్ 15,2019న ప్రారంభించారు.అప్పటి నుంచి ఏటా ఈ పథకం అమలుకు తగినంత ప్రాధాన్యం ఇస్తూ వీలున్నంత మేరకు పకడ్బంధీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.అయితే ఈ పథకం అమలు ఎలా ఉన్నా రైతులకు మాత్రం సాగు గిట్టుబాటు కావడం లేదన్నది వాస్తవం. ప్రభుత్వ లెక్కలు మాత్రం ఆహా!ఓహో!అనే విధంగానే ఉన్నా కూడా వాస్తవిక స్థితి ఇందుకు భిన్నంగా ఉంది.దీంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక రైతులు అవస్థలు పడుతున్నారు.మూడు తుఫానులు(నివర్, గులాబ్, జవాద్)గడిచిన కాలంలో ఆంధ్రావనిని అతలాకుత లం చేశాయి. అలాంటి సందర్భాల్లో పంట నష్టం అంచనాలు అన్నవి బాగానే ఉన్నా సాయం మాత్రం అరకొరగానే ఉందని వాపోతున్నారు. ఇప్పటికే పంటనష్టం కొందరికి అందలేదన్నది ఓ వాస్తవం. ఇదే క్షేత్ర స్థాయిలో నెలకొన్న అననుకూల పరిణామాలకు దర్పణం.

-2021–22 సీజన్లో ఇచ్చిన మొత్తం రూ.6,899.67 కోట్లు
-గడిచిన మూడేళ్లలో ఈ పథకం కింద అందించిన మొత్తం రూ.19,812.79 కోట్లు  

-ఇవీ రైతు భరోసా లెక్కలు అని ప్రధాన మీడియా చెబుతోంది..
-ఇది ఏపీ సర్కార్,పీఎం కిసాన్ సంయుక్తంగా అందిస్తున్న పథకం.



ఈ నేపథ్యంలో ఇవాళ తెలుగు రాష్ట్రాలలో నెలకొన్న ఓ అనూహ్య పరిణామమే ఇది.అనూహ్యం ఎందుకంటే అటు తెలంగాణలో రైతు బంధు పేరిట కేసీఆర్ యాభై వేల కోట్ల రూపాయలు విడుదల చేయనుండగా,మరోవైపు రైతు భరోసా పేరిట జగన్ తన వంతుగా 50,58,489 మంది రైతులకు మేలు చేకూర్చేందుకు 1,036 కోట్ల రూపాయలు మూడో విడత కింద విడుదల చేశారు. ప్రతి ఏటా మూడు విడతలుగా అందించే భరోసా మొత్తం 13,500 కోట్ల రూపాయలు కాగా ఆఖరి విడతలో ఒక్కో రైతుకు రెండు వేల రూపాయల చొప్పున అందిస్తారు.మొదటి విడతలో ఏడు వేల 500 రూపాయలు,రెండో విడతలో నాలుగు వేల రూపాయలు అందించగా,ఆఖరు విడతగా ఏడాది ఆరంభంలోనే రైతుకు వెన్నుదన్నుగా ఉండేందుకు రైతు భరోసా నిధులు విడుదల చేసి ముఖ్యమంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అని వైసీపీ వర్గాలు, అమాత్యుల బృందాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.కానీ క్షేత్ర స్థాయి వాస్తవాలు మాత్రం చాలా భిన్నంగా ఉన్నాయి.వైసీపీ సర్కారు చెప్పుకునేందుకు పైన పేర్కొన్న అంకెలు బాగానే

ఉన్నా,ప్రకటనల్లో ప్రస్తావించిన అంకెలు బాగానే ఉన్నా ఇవాళ రైతుకు గిట్టుబాటు అవుతున్నది ఏమీ లేకపోగా పంట విరామం కొన్ని చోట్ల ప్రకటించేందుకు సిద్ధం అవుతున్నారు కూడా!ఇదేవిధంగా అటు తెలంగాణలోనూ సాగు బాగోక,కలిసి రాక అవస్థలు పడుతున్న రైతులు,పంట సకాలంలో పండినా ధాన్యం కొనుగోలు లేక ఇబ్బంది పడుతున్న రైతులు ఎందరో! మరి! వీళ్లందరికీ భరోసా ఎవరు?బంధువెవరు?




మరింత సమాచారం తెలుసుకోండి: