రోజురోజుకీ టెక్నాలజీ లో మార్పు వస్తుంది. ముఖ్యంగా మనిషి జీవనశైలిలో వస్తున్న మార్పుల టెక్నాలజీలో మార్పులకు కారణమవుతున్నాయి అని చెప్పాలి. మనిషి మెదడులో మెదిలిన చిన్న ఆలోచన పెను మార్పులకు కారణమవుతోంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలా ఎంతో వినూత్నమైన ఆవిష్కరణలు తెరమీదకు వస్తున్నాయి.  ఒకప్పుడు కేవలం డీజిల్ తో నడిచే కార్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. కానీ ఆ తర్వాత కాలంలో పెట్రోల్ తో నడిచే కార్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు ఈ కార్లలో కూడా టెక్నాలజీ పెరిగిపోతూ వినూత్నమైన ఫీచర్లతో కూడిన కార్లు వెలుగులోకి వస్తూ ఉండడం గమనార్హం.



 కానీ ఇప్పుడు పెట్రోల్ కార్ల శకం ముగిసి పోతుంది అని అర్థమవుతుంది  అధునాతన టెక్నాలజీతో కూడిన ఎలక్ట్రికల్ వాహనాలు ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు కూడా ఎలక్ట్రానిక్ వాహనాలు తయారు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి అని చెప్పాలి. దాదాపు అన్నీ కార్ల తయారీ కంపెనీ లు  అన్నీ కూడా పెట్రోల్ కార్ల కు స్వస్తి పలికి ఆయిల్ వాహనాలను తెరమీదకు  తీసుకురావడం కోసం టెక్నాలజీని అభివృద్ధి చేస్తూ ఉన్నాయి.



 ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఇంజన్ డెవలప్మెంట్ సెంటర్ను మూసివేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కొరియన్ ఎకనమిక్ డైలీ ప్రకటించింది. బ్యాటరీ డెవలప్మెంట్ సెంటర్ తో పాటు ఎలక్ట్రికల్ మెయిన్ సెంటర్ ని కూడా ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త కేంద్రంలో బ్యాటరీ డిజైన్ తో పాటు బ్యాటరీ డెవలప్మెంట్ బృందాలు పని చేయబోతున్నారట. 2030 నాటికి 30 శాతం ఎలక్ట్రానిక్ వెహికల్స్.. తర్వాత పూర్తిగా ఎలక్ట్రానిక్ వెహికల్స్ ని అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది హుండాయ్. కొత్తగా ఆరు మోడల్స్  ఎలక్ట్రికల్ వెహికల్స్ ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలుస్తుంది. ఇది ఒక సంచలనాత్మక నిర్ణయం అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: