ప్రస్తుతం ఆయిల్ దేశాలలో ముఖ్య దేశంగా కొనసాగుతోంది సౌదీ అరేబియా. అయితే ఒకప్పుడు సౌదీ అరేబియా చాలా దేశాలతో శత్రుత్వాన్ని పెట్టుకునేది. కానీ ఇటీవలి కాలంలో  మాత్రం ఎన్నో దేశాలతో దౌత్య పరంగా ఎంతో బలమైన సంబంధాలు ఏర్పరుచుకుని ముందుకు సాగుతోంది. సౌదీ అరేబియా కి శత్రువులు ఎక్కువ కావడంతో ఎప్పుడు ఏ వైపు నుంచి దాడి జరుగుతుంది అన్నది కూడా ఊహకందని విధంగా ఉంటుంది. ఈ క్రమంలోనే తమ రక్షణ రంగాన్ని ఎప్పటికప్పుడు మరింత పటిష్టవంతంగా మార్చుకునేందుకు సౌదీ అరేబియా ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇతర దేశాల నుంచి ఆయుధాలను కొనుగోలు చేయడం చేస్తూ ఉంటుంది సౌదీ అరేబియా.



 ఒకవైపు ఎమెన్ తీవ్రవాదులు అటు సౌదీ అరేబియా ను టార్గెట్ గా చేస్తూ ఎప్పుడూ దాడులకు పాల్పడుతుంటారు అనే విషయం తెలుస్తుంది. మరోవైపు ఇరాన్ ప్రోద్బలంతో తీవ్రవాదులు సైతం సౌదీ అరేబియా టార్గెట్గా చేసుకుంటూ దాడులకు పాల్పడుతుంటారు. ఇలా ఉగ్రవాదుల నుంచి దాడులను తట్టుకునేందుకు సౌదీ అరేబియా ఆయుధాలను ఎప్పటికప్పుడు సమకూర్చుకుంటుంది. ఇప్పటికే అమెరికా నుంచి ఆయుధాలు ఉంటున్న సౌదీ అరేబియా ఇక ఇటీవల ఇజ్రాయిల్ తో కూడా మెరుగైన సంబంధాలు పెట్టుకొని ఆయుధాలు కొనుగోలు చేయడం ప్రారంభించింది. కానీ అటు జర్మనీ మాత్రం సౌదీ అరేబియాకు  ఆయుధాలు విక్రయించడం పై గతంలో నిషేధం విధించిన విషయం తెలిసిందే.



 గతంలో సౌదీ అరేబియా రాజు కుటుంబానికి సంబంధించిన వార్తలు రాసిన ఒక జెర్మనీ జర్నలిస్టు హత్యకు గురికావడం సంచలనంగా మారిపోయింది. ఈ క్రమంలోనే జర్నలిస్ట్ హత్య నేపథ్యంలో సౌదీ అరేబియాకు ఆయుధాలు విక్రయించబోము  అంటూ జర్మనీ నిషేధం విధించింది. ఇక ఇటీవలే ఈ నిషేధం ముగియాల్సిన సమయం వచ్చింది. కానీ ఈ నిషేధాన్ని కొనసాగిస్తూ ట్విస్ట్ ఇచ్చింది జర్మనీ. కారణం ఒకప్పుడు జర్నలిస్టు హత్య చేసిన రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి సౌదీ అరేబియా రాజు గా కొనసాగుతూ ఉండడమే.  ఇక మరో సంవత్సరం పాటు ఈ నిషేధాన్ని కొనసాగిస్తున్నట్లు ఇటీవలి ప్రకటన చేసింది జర్మనీ.

మరింత సమాచారం తెలుసుకోండి: