ఓ వైపు కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న తరుణంలో ఇజ్రాయెల్ లో మరో కొత్త రకం వ్యాధి కలకలం రేపుతోంది. ఓమిక్రాన్ అంత ప్రమాదకారి కాదు అని తేలడంతో కాస్త ఊరట చెందిన సమయంలో డెమిక్రాన్ అనే వేరియంట్ కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు అది ఇది కాకుండా నేరుగా మరో కొత్త వ్యాధి ఇజ్రాయెల్లో వెలుగుచూసింది. దాని పేరే ఫ్లోరోనా. నిజానికిది కరోనాకు కొత్త వేరియంట్ కాదని చెబుతున్నారు వైద్యనిపుణులు. ఓకే సమయంలో ఫ్లూ, కోవిడ్ లకు చెందిన రెండు రకాల వైరస్ లు శరీరంలోకి చేరడం వల్ల రోగనిరోధక వ్యవస్థ విచ్ఛిన్నమై ఈ కొత్త వ్యాధి సోకి ఫ్లోరోనా సోకి ఉండొచ్చని ఇజ్రాయెల్ వైద్య నిపుణులు చెబుతున్నారు.

 అక్కడ తొలి ఫ్లోరోనా కేసు నమోదయినట్టు ఇజ్రాయిల్ ప్రభుత్వం మీడియాకు వెల్లడించింది. ఓ గర్భిణీ స్త్రీలో మొదటి కేసు వెలుగు చూసినట్లు తెలిపింది. అయితే ఆమె ఇంతవరకు వ్యాక్సిన్ వేయించుకోలేదని స్పష్టం చేసింది. కరోనాకు వాక్సినేషన్ విషయంలో ప్రపంచంలోనే అందరికన్నా ముందు వరుసలో ఉంది ఇజ్రాయిల్. ఈ దేశంలో ఇప్పటికే మూడు టీకాలు వేశారు.కానీ వాటి ప్రభావం నాలుగు నెలలే అని తేలడంతో ఇప్పుడు నాలుగో డోసుకు కూడా అనుమతినిచ్చింది. గత కొన్ని వారాలుగా ఇన్ఫ్లోయేంజ కేసులు పెరుగుతున్నాయని ఈ క్రమంలో కొత్త వ్యాధి ఫ్లోరోనా ఉద్భవించి ఉండొచ్చని భావిస్తున్నారు. దీంతో ఇజ్రాయెల్ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై కొత్త వ్యాధి వ్యాప్తి కట్టడికి గట్టి చర్యలను చేపడుతోంది. ఇమ్యూనిటీ  వ్యవస్థను బలపరిచేందుకు కోవిడ్-19వ్యాక్సిన్ ను వేయడం ప్రారంభించింది. అయితే అనారోగ్యంతో ఉన్న వృద్ధులకు కూడా కరోనా వ్యాక్సిన్ వేసేందుకు అనుమతినిచ్చింది. నాలుగో డోసుకూ అనుమతినిచ్చిన తొలి దేశం ఇజ్రాయెల్ అవడం ఇక్కడ గమనించాల్సిన విషయం.

 రోగనిరోధకత తగ్గిన వాళ్లకోసం బూస్టర్ డోసును వేస్తున్నామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ అన్నారు. కాగా ఇజ్రాయిల్ దేశం లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే వుంది. ఇప్పుడు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఇజ్రాయెల్ లో వెలుగుచూసిన ఫ్లోరోనా కాస్త ప్రమాదకారి గానే అంటున్నారు. ఇది కోవిడ్, ఇన్ఫ్లూయెంజా వైరస్లు ఒకే సమయంలో శరీరంలో ప్రవేశించడం వల్ల ఏర్పడిన డబుల్ ఇన్ఫెక్షన్.

మరింత సమాచారం తెలుసుకోండి: