చైనా నుంచి వచ్చిన కరోనా మన దేశంలోకి ఎంటర్ అయ్యి ప్రజలను ప్రాణ భయంతో వణికిపోయేలా చేసింది. దాదాపు రెండేళ్ళు అదే భయం లో జనాలు వున్నారు. ఇటీవలే ఈవ్యాధి నియంత్రణకు వ్యాక్సిన్ అందుబాటులొకి వచ్చింది. దాంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం కరొనా కేసులు కూడా చాలా వరకూ తగ్గాయి. ఇది తగ్గింది అనుకొనే లోపు ప్రజలకు ఇప్పుడు మరో భయం పట్టుకుంది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ఈ వైరస్ కారణంగా ఇప్పుడు కొన్ని  రాష్ట్రాలలో లాక్ డౌన్ ప్రారంభమైంది.


మరి కొన్ని రాష్ట్రాలలో నైట్ కర్ఫ్యూ మొదలైంది. ఇది ఇలా ఉండగా ..ఇప్పుడు ముంబై వాసులు భయం తో ఆందోళన చెందుతున్నారు.కరోనా కేసులు మళ్లీ భారీ సంఖ్యలో వెలుగు చూస్తున్న విషయం తెలిసిందే. గడిచిన 24 గంటల్లో ముంబైలో 8వేల 82 కొత్త కోవిడ్ కేసులు,11 మరణాలు నమోదయ్యాయి. కాగా, అయితే ఇందులో 94 శాతం కేసులు అసింప్టమాటిక్ అని అధికారిక డేటా చెబుతోంది. ముంబై లో ప్రస్తుతం 37,274 యాక్టివ్ కోవిడ్ కేసులున్నాయని వైద్య అధికారులు వెల్లడించారు..


24గంటల్లో ముంబైలో కోవిడ్ తో హాస్పిటల్స్ లో చేరింది 574మంది మాత్రమేనని డేటా తెలిపింది. ఆసుపత్రిలో చేరిన 574 మంది రోగులలో 71 మంది ఆక్సిజన్ సపోర్టు లో ఉన్నారు. కాగా, భయాందోళనల ను తగ్గించడానికి హాస్పిటల్స్ లో చేరినవారు, అసింప్టమాటిక్ కేసుల సమాచారాన్ని ఇప్పుడు రోజువారీ ఆరోగ్య బులెటిన్‌లలో చేర్చుతున్నట్లు మహారాష్ట్ర మంత్రి పేర్కొంటున్నారు. ఇకపోతే మహారాష్ట్ర లో 68 కొత్త ఒమిక్రాన్ కేసులు బయటపడగా, ఇందులో 40 కేసులు ముంబైలోనే నమోదయ్యాయి. తాజా కేసుల తో కలిపి మహారాష్ట్ర లో నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 578కి చేరింది. దేశ వ్యాప్థంగా నమోదు అయిన ఒమిక్రాన్ కేసులలో అధికంగా మహారాష్ట్ర లోనే ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: