ఎవరు ఎవరిని కలిసినా లింకులే, ఎవరు ఎవరితో మాట్లాడినా లింకులే. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇలాంటివి ఈ మధ్య చాలానే వినిపిస్తున్నాయి. ఒక పార్టీ నాయకుడితో ఇంకో పార్టీ నాయకుడు మాట్లాడితే అంతేనా. ఏం మాట్లాడకూడదా? తెలంగాణలో రాజకీయాలు మారిపోతున్నాయి. ఒక పార్టీ నాయకుడు మరో పార్టీ నాయకుడు తో మాట్లాడితే చాలు లింకులు పెట్టేస్తున్నారు  ఈ నాయకుడు, ఆ నాయకుడి పార్టీలోకి జంప్ అవుతున్నాడంటూ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ మీద రెచ్చిపోతుంటారు. తెలంగాణ పాలిటిక్స్ లోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా అచ్చం ఇదే కనిపిస్తుంది. హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ గెలిచాడు. ఇంతలోనే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కుమారుడి పెళ్లోకటి వచ్చింది. ఆ వేడుకకు టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ రాజ్యసభ ఎంపీ కేకే హాజరయ్యారు.

ఈటెలను చూడగానే ఆప్యాయంగా హత్తుకున్నారు. ఇక అంతే కేకే ఈటెలను ఎందుకు హత్తుకున్నారు, ఈటల మళ్ళీ కారెక్కమ్మని కేకే అడిగారా లేక కేకే ను కమల పార్టీలోకి రమ్మని ఈటెల పిలిచారా అంటూ సోషల్ మీడియా లో ఒకటే గోల. తర్వాత సంగారెడ్డి నియోజక వర్గంలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్. కేటీఆర్,జగ్గారెడ్డి ఇద్దరూ కలిసి ఆప్యాయంగా మాట్లాడుకున్న దృశ్యం ఒకటి లీక్ అయింది. ఇక అంతే నెట్టింట ట్రోలింగ్ మొదలైంది. జగ్గారెడ్డి కారెక్కడం ఖాయం అనే టాక్  ప్రారంభమైంది. సహజంగానే దీనికి కొన్ని వర్గాలు నమ్మాయి తాతా షేక్పేట్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంలో కూడా సేమ్ సీన్ కనిపించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి కేటీఆర్ ఇద్దరు  ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం మీద రకరకాల కామెంట్స్ చేసినట్టు వినిపించింది. ఇక ఏపీలో కూడా అంతే. డిసెంబర్ లో వంగవీటి రంగా వర్ధంతి ఈ కార్యక్రమంలో వంగవీటి వారసుడు రాధాతో కలిసి వైసీపీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వంశీ హాజరయ్యారు.

రాధా, నాని, వంశీ  ఈ ముగ్గురు మంచి మిత్రులు. టిడిపి కి దూరంగా ఉంటున్న రాధాను వైసీపీలోకి లాగడానికి ఈ ఇద్దరు నేతలు మంతనాలు జరిపారని త్వరలోనే రాధాకు ఎమ్మెల్సీ ఇస్తారని సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరిగింది. ఇలాంటివి చాలా నడుస్తుంటాయి. కనిపించేదంతా నిజం కాదు,కనిపించని ఆ కోణం అబద్ధం అనిపించుకోదు.జరగని దానిమీద ఊహాగానాలు కామన్,జరిగే వాటి మీద అంచనాలు అంతే కామన్.

మరింత సమాచారం తెలుసుకోండి: