సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం మేకిన్ ఇండియా నినాదాన్ని తెరమీదకు తీసుకువచ్చారు. అయితే మేక్ ఇన్ ఇండియా నినాదానికి పిలుపునిచ్చి వదిలేయకుండా ఆ దిశగానే అడుగులు వేస్తోంది భారత ప్రభుత్వం. ఈ క్రమంలోనే భారత్లోని అన్ని రకాల వస్తువులను తయారు చేసుకోవడమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ముఖ్యంగా శత్రు దేశమైన చైనా కు షాక్ ఇస్తున్న ఎన్నో కంపెనీలను ఆకర్షించడంలో భారత్ సక్సెస్ అవుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే చైనా కు సంబంధించిన రంగులు, టపాకాయలు, బొమ్మలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వస్తువులపై  నిషేధం విధించి దేశీయంగా తయారు చేయడం మొదలు పెట్టింది భారత్.



 ఈ క్రమంలోనే అటు దిగ్గజ కంపెనీ యాపిల్ ను కూడా ఆకర్షించడంలో భారత్ సక్సెస్ అయింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వరకు చైనా లోనే యాపిల్ కంపెనీ కి సంబంధించిన అన్ని గ్యాడ్జెట్లు తయారవుతూ ఉండేవి. కానీ ఇటీవలి కాలంలో భారత్ వ్యూహాత్మకంగా వ్యవహ రించడం తో యాపిల్ చైనాను వదిలి భారత్లో తమ సంస్థను స్థాపించడం గమనార్హం.  ఈ క్రమంలోనే చెన్నై వేదికగా ఇటీవలే భారీగా ఉత్పత్తిని కూడా ప్రారంభించింది అన్న విషయం ఇటీవలి వెల్లడి అయింది అన్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు భారత్ లోకి అడుగు పెట్టిన యాపిల్ కంపెనీకి ఎంతోమంది ఇబ్బందులు సృష్టిస్తున్నారు అన్నది అర్ధమవుతుంది.



 ఇటీవల యాపిల్ కంపెనీ లో ఫుడ్ కారణంగా అస్వస్థతకు గురి కావడంతో ఇక ఎంతో మంది కార్మికులు సమ్మెకు దిగడం హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఈ ఘటనపై అటు విశ్లేషకులు మాత్రం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చైనా నుంచి భారత్కు వస్తున్న అన్ని కంపెనీల విషయంలో స్థానికంగా ఉండే ఎంతో కార్మికులు ఇబ్బందులు సృష్టిస్తున్నారు అంటూ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు యాపిల్ కంపెనీ విషయంలో కూడా ఇదే జరుగుతుంది అని అంటున్నారు. యాపిల్ కంపెనీలో ఫుడ్ పాయిజనింగ్ కావడానికి వెనుక కుట్ర జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు  విశ్లేషకులు. ఫుడ్ పాయిజనింగ్ జరిగినప్పుడు కాంట్రాక్ట్ తీసుకున్న వారిని నిలదీయాలి తప్ప యాపిల్ కంపెనీకి ఇబ్బందులు సృష్టించడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: