వైసీపీకి ఒక ట్రబుల్ షూటర్ కావాలా? పార్టీలో నడుస్తున్న ఆధిపత్య పోరుకు చెక్ పెట్టడానికి ఒక నాయకుడు కావాలా? అంటే అవును ఖచ్చితంగా కావాలనే చెప్పాలి. ఎందుకంటే వైసీపీకి కర్త, కర్మ, క్రియ అన్నీ జగనే. అయితే ఆయనకు అన్నీ విషయాలపై ఫోకస్ పెట్టే సమయం లేదు. ఓ వైపు సీఎంగా, మరోవైపు పార్టీ అధ్యక్షుడుగా ఆయనకు అనేక బాధ్యతలు ఉన్నాయి. ముఖ్యంగా సీఎంగా ఆయనకు చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి...రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. కాబట్టి ఆయన ఎక్కువగా పార్టీపై ఫోకస్ చేయలేరు. అలాగే నేతలతో గానీ, కార్యకర్తలతో గానీ మాట్లాడలేరు.

అలాగే పార్టీలో ఉండే సమస్యలని చూసుకోలేరు. అలాంటప్పుడు పార్టీని లైన్‌లో పెట్టడానికి ఒక ట్రబుల్ షూటర్ మాత్రం కావాలని చెప్పొచ్చు. అది ఎలా అంటే ఎక్కడ సమస్య ఉన్నా సరే అక్కడకు వెళ్ళి నేతలని సమన్వయం చేసుకుని, పార్టీలో ఎలాంటి విభేదాలు లేకుండా చూసుకుని, అందరూ కలిసి పనిచేసేలా గైడెన్స్ ఇవ్వాలి. అలా చేస్తేనే మళ్ళీ పార్టీ గాడిలో పడుతుంది. ఇలా తెలంగాణ రాజకీయాల్లో మంత్రి హరీష్ రావు చేస్తారు.

కేసీఆర్ సీఎంగా ఉండగా, కేటీఆర్ అభివృద్ధి కార్యక్రమాలని చూసుకుంటారు. ఇక హరీష్ మంత్రిగా ఉంటూనే, పార్టీలో ఉన్న సమస్యలని పరిష్కరించి, ప్రత్యర్ధులకు చెక్ పెట్టేలా వ్యూహాలు వేస్తారు. అందుకే ఆయన్ని ట్రబుల్ షూటర్ అంటారు. అలాంటి ట్రబుల్ షూటర్ ఇప్పుడు ఏపీలో వైసీపీకి కావాలి. ఎందుకంటే ఈ మధ్య వైసీపీలో ఎక్కడకక్కడ ఆధిపత్య పోరు బాగా పెరిగిపోయింది. చాలా నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతలకు...ఒకరంటే ఒకరికి పడని పరిస్తితి. ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు గళం విప్పుతున్నారు. ఒక నియోజకవర్గం అయితే పర్లేదు. చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్తితి. కాబట్టి ఒక ట్రబుల్ షూటర్ ఈ సమస్యలని పరిష్కరించి..మళ్ళీ పార్టీని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది. అప్పుడు పార్టీకి బెనిఫిట్...లేదంటే టీడీపీకి బెనిఫిట్.

మరింత సమాచారం తెలుసుకోండి: