ఇటీవల తెలుగుదేశం పార్టీలో ఊహించని మార్పులు జరుగుతున్న విషయం తెలిసిందే. చాలా నియోజకవర్గాల్లో టీడీపీ నాయకత్వాల్లో మార్పులు జరుగుతున్నాయి. ఎక్కడకక్కడ చంద్రబాబు కొత్త ఇంచార్జ్‌లని పెట్టుకుంటూ వస్తున్నారు. నాయకులు మంచిగా పనిచేస్తే పర్లేదు...లేదంటే వారిని మార్చేస్తున్నారు. అలాగే వయసు మీద పడిన నాయకులని కూడా ఈ సారి పక్కన పెట్టేయాలని బాబు డిసైడ్ అయ్యారు. వారు యాక్టివ్‌గా పనిచేయకపోవడం వల్ల పలు నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్తితి బాగోలేదు.

చాలా చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నా సరే, టీడీపీ వీక్ గా ఉండటం వారికి కలిసొస్తుంది. అందుకే వయసు మీద పడిన నాయకులని కూడా బాబు సైడ్ చేస్తున్నారు. వారికి తర్వాత పార్టీలో ఏవైనా కీలక పదవులు ఇవ్వొచ్చని భావిస్తున్నారు. ఇదే క్రమంలో నెల్లిమర్లలో సీనియర్ నేత పతివాడ నారాయణస్వామిని తప్పించడానికి బాబు సిద్ధమయ్యారు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పతివాడకు వయసు మీద పడింది. దీంతో ఆయన నియోజకవర్గంలో యాక్టివ్‌గా పనిచేయలేకపోతున్నారు.

దీని వల్ల నెల్లిమర్లలో టీడీపీ పరిస్తితి మెరుగు పడటం లేదు. దీంతో నియోజకవర్గానికి బలమైన ఇంచార్జ్‌ని పెట్టాలని బాబు చూస్తున్నారు. ఇప్పటికే నెల్లిమర్ల నేతలతో బాబు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు నేతలు ఇంచార్జ్ పదవి కోసం పట్టుబట్టారు. దీంతో చంద్రబాబు నెల్లిమర్ల ఇంచార్జ్ పదవిపై అప్పుడే డిసైడ్ అవ్వకుండా..సర్వే ద్వారా డిసైడ్ అవ్వాలని ఫిక్స్ అయ్యారు. ఏ నాయకుడుకు ఇంచార్జ్ పదవి ఇవ్వాలనే అంశంపై సర్వే చేయిస్తున్నారు.

ఇంచార్జ్ పదవి కోసం మహంతి చిన్నంనాయుడు, కర్రోతు బంగార్రాజు, కంది చంద్రశేఖర్‌, సువ్వాడ వనజాలు గట్టిగానే ట్రై చేస్తున్నారు. అలాగే పతివాడ మనవడు తారకరామ నాయుడు సైతం ఇంచార్జ్ పదవి ఆశిస్తున్నారు. అయితే తారకరామకు రాజకీయంగా అంత అనుభవం లేదు...ఫ్యామిలీ సపోర్ట్ తప్ప. ఇక కర్రోతు బంగార్రాజు వైపే నెల్లిమర్ల టీడీపీ శ్రేణులు ఎక్కువ మొగ్గు చూపుతున్నాయని తెలిసింది. కర్రోతుకే నెల్లిమర్ల ఇంచార్జ్ ఇవ్వొచ్చని తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: