ప్రస్తుత పరిస్థితుల్లో బయట మంచి నీళ్ళు తాగాలన్న కూడా భయం తో వణికి పోతున్నారు. కరోనా లాంటి భయంకర వ్యాధులు వస్తున్నా కూడా బయట దొరికే స్ట్రీట్ ఫుడ్ కు డిమాండ్ మాత్రం తగ్గలేదు. ముఖ్యంగా పానీ పూరికి మాత్రం క్రేజ్ తగ్గలేదు. అన్నీ రకాల రుచులతో ఉన్న పానీ పూరికి డిమాండ్ రోజు రోజుకు పెరుగుపోతుంది. ఇది భారతదేశంలో ముఖ్యమైన స్ట్రీట్ ఫుడ్ గా మారిపోయింది. నగరాల్లో, పట్టణాల్లో ఏగల్లీకి వెళ్ళినా పానీ పూరీ విక్రయించే బండ్లు దర్శనమిస్తుంటాయి.


సాయంత్రం వేళల్లో ఈ బండ్ల వద్ద ఎంతో హడాహుడి కనిపిస్తుంటుంది. వాటి వద్ద నిలబడి చాలా మంది పానీ పూరీలను ఇష్టంగా లాగించేస్తుంటారు. పానిపూరి తినడానికి పేద, ధనిక అనే తేడా లేదు. మరోవైపు అనేక మంది ఈ పానీ పూరీలను ఇంట్లోనే తయరు చేసుకుంటున్నారు. చిన్నారులు వీటిని తినేందుకు ఇష్టపడతుండటం తో తల్లిదండ్రులు వీటిని తయారు చేసి సాయంత్రం వేళలో చిరుతిండిగా అందిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు బయట తింటే ప్రాణాలు పోతాయి..


వీటిని ఎక్కువగా తినడం వల్ల అనేక అనారొగ్య సమస్యలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. పానీ పూరీలను నూనెలో వేయిస్తారు. ఆ పూరీల తయారీకి మైదా పిండి వినియోగిస్తారు. వీటిని వేయించేందుకు వాడే నూనె తో పాటు తయారు చేసేందుకు వాడే మైదా పిండి.. ఆరోగ్యానికి మంచిది కాదు. అలా చేయడం వల్ల బరువు కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. గుండె జబ్బులు, అధిక బరువు , మధుమేహం వంటి సమస్యలతో బాధపడుతున్నవారు పానీపూరీలకు దూరంగా ఉండటం మంచిది. ఎవరికీ కరోనా వుందో లేదా తెలియదు అలాంటి సమయంలో స్ట్రీట్ ఫుడ్ తినకపోవడం మేలు.. వీలైనంత వరకూ ఇంట్లోనే చేసుకొని తినడం ఉత్తమం. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందని గుర్తుంచుకోండి...


మరింత సమాచారం తెలుసుకోండి: