హైదరాబాద్‌.. దక్కను పీఠభూమిలో ఉన్న మహానగరం.. ఈ నగరం చుట్టూ గతంలో అనేక చెరువులు, కుంటలు, జలాశయాలు ఉండేవి.. మహానగరంగా హైదరాబాద్ విస్తరించే క్రమంలో అనేక జలాశయాలు మాయం అయ్యాయి. చెరువులను కబ్జా చేసి ఇల్లు కట్టేశారు.. పెద్ద చెరువులను ఆక్రమించి కుంటలుగా మార్చేశారు.. ఇలా చాలా ప్రకృతి విధ్వంసం జరిగింది. ఇకపై అలా జరగకుండా.. ప్రస్తుతం ఉన్న చెరువులు, కుంటలు, ఇతర జలాశయాలను అభివృద్ధి చేసేందుకు కేటీఆర్‌ ఓ కొత్త విధానం తెచ్చారు.


ఈ కొత్త విధానం ప్రకారం.. చెరువుల పరిరక్షణ, అభివృద్ది, గ్రీనరీ పెంపుదల బాధ్యత.. ఆ చుట్టుపక్కల వెంచర్లు వేసే రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులదే. ఇక మీదట వెంచర్ పరిధిలోని జలాశయాల సంరక్షణ రియల్ డెవలపర్స్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు వెంచర్లకు అనుమతుల సమయంలోనే  పరిశీలన జరుపుతారు. హైదరాబాద్ మెట్రపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ.. హెచ్ఎండిఏ.. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్.. జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న చెరువులు, కుంటలు, జల వనరుల సంరక్షణకు, అభివృద్ధికి కేసీఆర్‌ ప్రభుత్వం మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను నిర్ణయించింది.


ప్రపంచంలో అత్యుత్తమ నగరాలలో ఒకటిగా నిలిచి అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన హైదరాబాద్ పరిసరాల్లోని చెరువులను వారసత్వ సంపదగా కాపాడాలని మంత్రి కేటీఆర్ పిలుపు ఇచ్చారు. దీని కోసం పటిష్ట చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ మంత్రి కె.టి.రామారావు అధికారులకు  సూచించారు. జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ పరిధిలో భారీ అంచనాలతో రియల్ ఎస్టేట్ విస్తరణ పనులు జరుగుతున్నాయి. స్థానిక పరిస్థితులను చక్కదిద్దేందుకు ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న చెరువులు, కుంటలను సంరక్షించాలని ప్రభుత్వం భావిస్తోంది.


అభివృద్ధి, పూర్వ వైభవం కల్పించే పనిని స్థానిక డెవలపర్స్ కు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. లే అవుట్, మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ , గేటెడ్ కమ్యూనిటీ, కమర్షియల్ కాంప్లెక్స్ వంటి వాటికి అనుమతి ఇచ్చే సమయంలో ఈ అంశాలను పరిశీలిస్తారు. వారి డెవలప్ మెంట్ ఏరియాలో ఉన్న లేక్స్ అభివృద్ధి బాధ్యతలు వారే నిర్వహించాల్సి ఉంటుందని గట్టిగా చెబుతారు. ఈ ఐడియా ఏదో బాగానే ఉంది కదా.


మరింత సమాచారం తెలుసుకోండి:

ktr