తెలంగాణ‌లో కాంగ్రెస్ పుంజుకునేందుకు ఆ పార్టీ అధ్య‌క్షుడు ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నాడు. కానీ, ఇందుకు సీనియ‌ర్ నేత‌లు క‌లిసి రావ‌డం లేదు. తాజాగా గాంధీభ‌వ‌న్‌లో నిర్వ‌హించిన డిజిట‌ల్ మెంబ‌ర్‌షిప్ స‌మావేశం ప్రారంభ‌మైంది. అయితే, స‌మావేశానికి సీనియ‌ర్ నేత‌లు గైర్హాజ‌ర‌య్యారు. 18మంది నేత‌లు హాజ‌రు కావాల్సి ఉండ‌గా కేవ‌లం ఆరుగురు మాత్ర‌మే వచ్చారు. జ‌గ్గారెడ్డి, దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌, మ‌ధుయాష్కి, ఉమామ‌హేశ్వ‌ర‌రెడ్డి తో పాటు ప‌లువురు సీనియ‌ర్ నేత‌లు హాజ‌రు కాలేదు. ఇక ఇటీవ‌ల రేవంత్ వ‌ర్సెస్ జ‌గ్గారెడ్డి అన్న‌ట్టు రాజ‌కీయాలు సాగుతున్నాయి. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ఈ నెల 5న టీపీసీసీ పొలిటిక‌ల్ ఎఫైర్స్ క‌మిటీ భేటీ జ‌ర‌గ‌నుంది. ఈ భేటీలో ప‌లు అంశాల‌పై చ‌ర్చించ‌నున్నారు. అయితే, స‌మావేశంలో జ‌గ్గారెడ్డి అంశ‌మే ప్ర‌ధానంగా చర్చ‌కు వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది.


 ప్ర‌స్తుతం కాంగ్రెస్‌లో రేవంత్ అనుకూల వ‌ర్గం వ్య‌తిరేక వ‌ర్గం ఉన్న నేప‌థ్యంలో ఈ భేటీలో ఇరు వ‌ర్గాలు వాడీవేడిగా వాదించుకునే అవ‌కాశం లేక‌పోలేద‌ని తెలుస్తోంది. ర‌చ్చ‌బండ విష‌య‌మై చ‌ర్చించే అవ‌కాశం ఉంది. దీంతో స‌మావేశంలో రేవంత్ వ్య‌తిరేక వ‌ర్గానికి కౌంట‌ర్ ఇచ్చేలా రేవంత్ వ‌ర్గం ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్న‌ట్టు స‌మాచారం. మ‌రోవైపు హుజురాబాద్ ఫ‌లితాల‌పై పోస్టుమార్టంపై చ‌ర్చించే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. అయితే, టీపీసీసీ చీఫ్ రేవంత్‌కు క‌రోనా సోకడంతో ఐసోలేష‌న్‌లో ఉన్నారు. దీంతో ఆయ‌న వ‌ర్చువ‌ల్‌గా భేటీలో పాల్గొంటారా.. లేదా భేటీ వాయిదా ప‌డుతుందా..? అనేది తేలాల్సి ఉంది.


  ఇదిలా ఉంటే కొత్త ఏడాదిలో బీజేపీ, టీఆర్ఎస్ కు  ధీటుగా తెలంగాణలో కాంగ్రెస్ ఢీ కోట్టాల్సి ఉంటుంది. దీంతో ప్ర‌స్తుతం ఉన్న గ్రూపు రాజ‌కీయాల‌తో ముందుకు వెళ్తే పార్టీ న‌ష్ట‌పోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. మొత్తానికి టీపీసీసీ స‌మావేశంలో పార్టీని ముందుకు తీసుకెళ్లాడానికి రేవంత్ వ్యూహం ర‌చించిన‌ట్టు స‌మాచారం. అయితే, రేవంత్‌పై సీనియ‌ర్లు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న నేప‌థ్యంలో ఢిల్లీ అధిష్టానం అండ‌గా నిల‌బ‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. అధిష్టానం ఇచ్చిన బ‌లంతోనే రేవంత్ ముందుకు వెళ్తాన్నాడ‌ని స్ప‌ష్టంగా కనిపిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: