ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అందిన కాడికి, అందనంత అప్పులు చేస్తోంది. గత వారం పది రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేసిన అప్పు ఎంతో తెలిస్తే నివ్వర పోతారు రిజర్వు బ్యాంకు నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు రుణాలుగా పొందింది. ఎంత వడ్డీ చెల్లించేందుకు ఏపి అంగీకరించిందో తెలిస్తే మీరు అవాక్కవుతారు ...ద్వారం ముందరే ఆగిపోతే ఎలా.. లోనికి రండి. జాగ్రత్తగా చదవండి.  అప్పు ఎంతో.. వడ్డీ ఎంతో ఒక్కసారి పరిశీలించండి.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం  గత వారం పదిరోజులుగా పెద్ద మొత్తంలో రుణం సమీకరించింది. దీని విలువ దాదాపుగా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల పైమాటే. రిజర్వు బ్యాంక్ నిర్వహించిన సెక్యూరిటీల వేలం లో ఆంధ్ర ప్రభుత్వం పాల్గోంది.  కేంద్ర ఆర్థిక శాఖ అధికారులతో ఆంధ్ర ప్రదేశ్  ఆర్థిక శాఖ అధికారులు సంప్రదించి,ఆ తరువాత సెక్యూరిటీల వేలంలో పాల్గోన్నట్లు సమాచారం. ఈ విషయం అధికారికంగా వెల్లడి కాలేదు. ఈ రెండు మూడు రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల మేర రుణం పొందినట్లు సమాచారం. ఈ మొత్తం  రుణం కూడా మూడు విభాగాలుగా  సేకరించిందని, తిరిగి  చెల్లించే వాయిదా కాలాన్ని బట్టి వడ్డీ  లెక్కించినట్లు సమాచారం. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఐదు వందల కోట్ల రూపాయల మొత్తాన్ని పదహారు నెలల్లో తిరిగి చెల్లించేందుకు అంగీకరించింది.ఈ ఐదు వందల కోట్ల రూపాయలకు 7.24 శాతం వడ్డి  చెల్లించేందుకు అంగీకారం తెలిపింది. వెయ్యి కోట్ల రూపాయల రుణాన్ని పద్దేనిమిది నెలల కాలపరిమితితో తిరిగి చెల్లించేందుకు అంగీకరించింది ఇందుక గాను 7.18 శాతం వడ్డీని చెల్లించ నుంది. అదే విధంగా మరో వెయ్యి కోట్ల రూపాయల రుణం తిరిగి చెల్లించేదుకు ఇరవై నెలల గడువును ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కోరింది. ఇందుకు 7.22 శాతం వడ్డీ చెల్లించేందుకు ముందుకు వచ్చింది.  తొలుత పేర్కోన్న విధంగా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల్లో మిగిలిన రెండు వేల కోట్ల రూపాయలకు ఎంత మేర వడ్డీ చెల్లించేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించిందనే విషయం ఇంకా వెల్లడి కాలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: