శాలువ ఒక‌టి : ప్ర‌ధానితో స‌మావేశం
అజెండా : రాష్ట్ర స‌మస్య‌ల‌పై మాట్లాడ‌డం
ఏం చేయాలి : హోదా గురించి ఏం చేశారో అడ‌గాలి ప్ర‌శ్నించాలి
ఏం చెప్పారు : అవేవీ అడ‌గ‌కుండానే న‌వ్వుతూ తుళ్లుతూ
బ‌య‌ట‌కు వ‌చ్చేశారు జ‌గ‌న్
ఇప్పుడేంటి: ఏం లేదు మ‌నం కూడా ఓ శాలువ క‌ప్పుకుని రెండు చేతులూ జేబులో పెట్టుకుని ఎక్క‌డికో న‌డిచి వెళ్లిపోవ‌డం మిన‌హా చేసేదేం లేదు. ఎందుకంటే గౌర‌వ సీఎం హోదా గురించి అడ‌గ‌రు.ఆయ‌న అడుగుతారు అని అనుకోవ‌డం ఓ పెద్ద భ్ర‌మ. కేవ‌లం త‌నకు సంబంధించిన వివ‌రాలు, ఇంకా చెప్పాలంటే త‌న‌కు సంబంధించి అక్ర‌మాస్తుల కేసుల వివరాలు వీటి గురించి మాత్రం మాట్లాడి వ‌స్తారు అన్న‌ది జ‌న‌సేన అభియోగం.



శాలువ 2 : ఆర్థిక మంత్రి తో స‌మావేశం
అజెండా : ఆర్థిక ప‌ద్దు లెక్క చెప్ప‌డం ఎంత కావాలో అడ‌గడం
ఎంత ఇస్తారో తెలుసుకోవ‌డం కొత్త అప్పుల లెక్క‌లు వివ‌రించ‌డం
ఏం చెప్పారు : ఆయ‌నేం చెప్ప‌రు కేంద్రం పంపిన నిధుల‌ను మాత్రం
వాడుకుని మోడీ బొమ్మ‌ను కేంద్ర ప్రాయోజిక ప‌థ‌కాల‌కు వాడుకోరు
దీనిని దిగువ కోర్టు, పై కోర్టు త‌ప్పు ప‌ట్టినా ఆయ‌న‌కు కోపం వ‌స్తుంది.
కోర్టుల‌కు న్యాయ‌మూర్తుల‌కు ఉద్దేశాలు మాత్రం ఆపాదిస్తారు.. అది త‌ప్పు
న్యాయ సూత్రాల‌కు విరుద్ధం అని తెలిసినా మాట్లాడ‌తారు ద‌టీజ్ జ‌గ‌న్
ఇదీ జ‌గ‌న్ గురించి జ‌న‌సేన వినిపించాల‌నుకున్న మాట.
ఇప్పుడేంటి : హోదా లేదు అప్పులు పుట్ట‌వు క‌నుక మ‌నం ఎవ‌రి దారి వాళ్లే వెతుక్కుని స‌న్యాసం పుచ్చుకోవాలి.అది కూడా జ‌గ‌న‌న్న ఒప్పుకుంటేనే.లేదా కొడాలి నాని అనే మంత్రి గుట్కా గ‌ట్రా న‌ములుతూ మ‌నల్ని తిట్ట‌రాని తిట్టు తిట్టినా కూడా ఒక్క మాట మ‌నం ఎదురు చెప్ప‌కూడ‌దు. ఇదీ ఆంధ్రావ‌నిలో అప్పుల భాగోతం.. పాల‌న విష‌య‌మై జ‌గ‌న్ వినిపించే ఉపోద్ఘాతం.

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా సీఎం జ‌గ‌న్ అటు ప్ర‌ధాని మోడీతోనూ ఇటు ఆర్థిక మంత్రి,తెలుగింటి కోడ‌లు నిర్మ‌లా సీతారామ‌న్ తోనూ భేటీ అయ్యారు. ఇద్ద‌రికీ శాలువలు క‌ప్పి,జ్ఞాపిక‌లు అంద‌జేశారు.దీనిపై ఇప్పుడు వ‌రుస ట్రోల్స్ వ‌స్తున్నాయి.అస‌లు రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి అయి ఉండి అడ‌గాల్సిన‌వి అడ‌గ‌కుండా శాలువ‌లు క‌ప్పి న‌వ్వులు చిందించి రావ‌డం ఏంట‌ని జ‌న‌సేన ప్ర‌శ్నిస్తోంది.శాలువ ఒక‌టి శాలువ రెండు అంటూ ట్రోల్స్ న‌డిపిస్తోంది విప‌క్ష పార్టీ. మోడీని క‌లిసి రెండంటే రెండు వేల కోట్ల రూపాయ‌ల బ‌కాయిలు గురించి అడ‌గ‌డం,అది సాక్షి ప‌త్రిక ప్ర‌ధానంగా రాసుకోవ‌డం చూస్తుంటే రాష్ట్రం ఆర్థికంగా ఎంత‌గా దిగ‌జారిందో ఆలోచించుకోవ‌చ్చ‌ని జ‌న‌సేన బాధ‌ప‌డుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

ycp