వివిధ దేశాలు, రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు హరీష్ రావు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఇప్పటికే వాక్సినేషన్ పై దృష్టి సారించడం వల్ల మొదటి డోసు లక్ష్యం దాదాపుగా వంద శాతానికి చేరువ అయిందని... ఇదే స్ఫూర్తితో రెండో డోసును వంద శాతం పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు. 15- 18 ఏళ్ల వయస్సు వారికి వ్యాక్సిన్, 60 ఏళ్లు పై బడిన వారికి మూడో డోసు (బూస్టర్ డోస్) విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో ఆ దిశగా చర్యలు వేగవంతం చేయాలని పేర్కొన్నారు. ఈ సమీక్షలో హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, టీఎస్ఎంఐడిసి ఛైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, సీఎం ఓఎస్డి గంగాధర్, డీఎంఇ రమేష్ రెడ్డి, డీహెచ్ శ్రీనివాస్ రావు, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, టీఎస్ఎంఐడిసి ఎండి చంద్రశేఖర్ రెడ్డి, కాళోజీ వర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి గురించి ఉన్నతాధికారులు ఈ సందర్బంగా వివరించారు. రాష్ట్రంలో నమోదవుతున్న ఒమిక్రాన్ కేసులు, వారి ఆరోగ్య పరిస్తితి, అందిస్తున్న చికిత్స గురించి హరీష్ రావుకు తెలిపారు. వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రభావం తక్కువ ఉన్నట్లు పలు అధ్యయనాల ఆధారంగా చెప్పారు. ఒమిక్రాన్ సోకి టిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న, వారి ఆరోగ్యం బాగుందని, కోలుకుంటున్నారని సమీక్షలో అధికారులు వివరించారు.


జాతీయ స్థాయిలో మొదటి డోసు సగటు 90 శాతం ఉంటే, తెలంగాణలో 99.46 శాతానికి చేరువ అయిందని... రెండో డోసు విషయంలో జాతీయ సగటు 61 కంటే 3శాతం ఎక్కువతో, 64 శాతం ఉందన్నారు హరీష్ రావు.  కరోనా నుండి ప్రజల్ని కాపాడుకునెందుకు ప్రతి ఒక్కరూ రెండు డోసులు వేసుకోవాల్సిన నేపథ్యంలో.. రెండో డోసు విషయంలో మరింత వేగాన్ని పెంచాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని... వంద శాతం లక్ష్యం చేరువ చేయాలని ఆదేశించారు. 15-18 యేండ్ల వయస్సు వారు 22.78 లక్షలు, 60 ఏళ్ల పై బడిన వారు 41.60 లక్షలు, హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వారియర్లు 6.34 లక్షలు ఉన్నారు, వీరందరికీ దాదాపు 70 లక్షల వ్యాక్సిన్ అవసరం ఉంటుందని చెప్పారు.  జనవరి 3 నుండి 15-18 వయస్సు వారికి, జనవరి 10 నుండి 60 ఏళ్ల పై బడిన వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు హరీష్ రావు.

మరింత సమాచారం తెలుసుకోండి: