ఎన్నో దశాబ్దాల నుంచి భారత్ పాకిస్తాన్సరిహద్దు ప్రాంతమైన కాశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రపంచానికి తెలిసిన మినీ సైజ్ యుద్ధం పాకిస్తాన్ భారత సరిహద్దుల్లో ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడ్డటం ఇక ఆ తర్వాత నరమేధం సృష్టించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇప్పటికే ఎన్నో బాంబు పేలుళ్లకు పాల్పడి మారణహోమం సృష్టించారు ఉగ్రవాదులు.కానీ ఇప్పుడు భారత ప్రభుత్వం సైన్యానికి సర్వాధికారాలు ఇస్తున్న నేపథ్యంలో సరిహద్దుల్లో సైన్యం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటుంది. ఉగ్రవాదులు భారత్ లోకి అడుగు పెట్టగానే ఎన్ కౌంటర్ చేస్తూ ఎక్కడికక్కడ మట్టు పెడుతుంది భారత ఆర్మీ.


 ఇలా ఇటీవలి కాలంలో భారత ఆర్మీ వివిధ ఆపరేషన్స్ నిర్వహించి వందల మంది ఉగ్రవాదులను ఎన్కౌంటర్లో మట్టు పెట్టింది అన్న విషయం తెలిసిందే. అదే సమయంలో 370 ఆర్టికల్ రద్దు తర్వాత కాశ్మీర్ ప్రాంతంలో ప్రజలు అందరిలో మార్పు రావడంతో ఎవరు కూడా ఉగ్రవాదులకు మద్దతు తెలిపే పరిస్థితి లేదు. ఇక మరోవైపు ఆర్మీ ఎప్పటికప్పుడు జల్లడ పడుతూ ఉగ్రవాదులను గుర్తించే పనిలో నే ఉంటుంది. దీంతో ఎక్కడ తల దాచుకోవాలో తెలియక పెద్ద పెద్ద గుట్టలను తొలిచి స్తావరాలను   ఏర్పాటు చేసుకుంటూ ఉండటం గమనార్హం. అయినప్పటికీ వదలని భారత ఆర్మీ ఉగ్రవాదుల ఆటలకు చెక్ పెడుతూనే ఉంది.



 అయితే గత కొంత కాలం నుంచి జైషే మహ్మద్ ఉగ్రవాది సంస్థకు చెందిన ఎంతో మంది ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. కేవలం 48 గంటల వ్యవధిలోనే ఆరుగురు ఉగ్రవాదులను హతమార్చింది భారత ఆర్మీ. ఇటీవలే ఎవరికీ దొరకకుండా రహస్య స్థావరాలు ఏర్పాటు చేసుకుని కొండల లో దాగి ఉన్న ముగ్గురు ఉగ్రవాద సంస్థకు సంబంధించిన తీవ్రవాదులను ఆపరేషన్ నిర్వహించి మరీ గుర్తించి ఎన్ కౌంటర్ చేసింది భారత ఆర్మీ. అంతే కాకుండా ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడెందుకు అనుసరిస్తున్న మార్గాలను కూడా తెలుసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: