గత ఎన్నికల్లో టీడీపీ తరుపున గెలిచి వైసీపీ వైపుకు నలుగురు ఎమ్మెల్యేలు వెళ్ళిన విషయం తెలిసిందే. టీడీపీ అధికారం కోల్పోవడంతో వారు వైసీపీ వైపుకు జంప్ చేసేశారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరిలు వైసీపీ వైపుకు వెళ్లారు. అయితే ఇలా వెళ్ళిన ఎమ్మెల్యేలకు చెక్ పెట్టడానికి టీడీపీ గట్టిగానే ప్రయత్నిస్తుంది. ఈ సారి ఎన్నికల్లో వీరిపై బలమైన నాయకులని నిలబెట్టి చెక్ పెట్టాలని చూస్తున్నారు.

ఇప్పటికే ఆ నాలుగు నియోజకవర్గాల్లో కొత్త ఇంచార్జ్‌లని తీసుకొచ్చారు. అయితే జంపింగ్ ఎమ్మెల్యేలు బలంగా ఉండటం వల్ల కొందరు టీడీపీ నేతలు పికప్ అవ్వలేకపోతున్నారు. అయితే గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి బలం మాత్రం కాస్త తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. మద్దాలితో పోలిస్తే మిగిలిన ఎమ్మెల్యేలకు కాస్త వ్యక్తిగత ఇమేజ్ ఉంది. కానీ మద్దాలి గత ఎన్నికల్లో టీడీపీ ఇమేజ్‌తోనే గెలిచారు. పైగా అమరావతి ప్రభావంతో గుంటూరు నగరంలో గెలిచారు.

గుంటూరు వెస్ట్ టీడీపీకి కంచుకోటగా ఉండటంతోనే మద్దాలికి విజయం దక్కింది. అయితే మద్దాలి వైసీపీ వైపుకు వెళ్లడంతో అక్కడ టీడీపీ ఇంచార్‌్ గా కోవెలమూడి రవీంద్రని నియమించారు. రవీంద్ర సైతం దూకుడుగా పనిచేసుకుంటూ ముందుకెళుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో వెస్ట్ సీటు రవీంద్రకే ఫిక్స్ చేస్తారని తెలుస్తోంది.

అటు వైసీపీ నుంచి మద్దాలి గిరి బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే మద్దాలికి ఎక్కువ వ్యతిరేకత కనిపిస్తోంది. పైగా అమరావతి ప్రభావం ఫుల్ గా ఉంది. వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుంది. అటు గుంటూరు వెస్ట్‌లో టీడీపీ స్ట్రాంగ్‌గా ఉంది. ఈ పరిస్తితులని బట్టి చూస్తే మద్దాలి గిరికి ఈ సారి మాత్రం చెక్ పడేలా ఉంది. పైగా ఇక్కడ కమ్మ వర్గం ప్రభావం కాస్త ఎక్కువగానే ఉంది...దీంతో కమ్మ నేత అయిన కోవెలమూడికి కాస్త కలిసొచ్చేలా ఉంది. చూడాలి మరి మద్దాలిగిరికి టీడీపీ చెక్ పెట్టగలదో లేదో.

మరింత సమాచారం తెలుసుకోండి: