అదేంటి సోము వీర్రాజుకి పవన్ కల్యాణ్ మంచి మిత్రుడే కదా, ఇంకేంటి సమస్య అనుకుంటున్నారా..? కానీ ఈమధ్య వీరిద్దరి మధ్య ఏదో గ్యాప్ పెరిగినట్టు కనిపిస్తోంది. గ్యాప్ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్యే కాదు, ఇరు పార్టీల మధ్య కూడా. ప్రజా ఆగ్రహ సభ పేరుతో బీజేపీ సోలోగా ఇచ్చిన పర్ఫామెన్సే దీనికి పెద్ద ఉదాహరణ. ఏపీలో ఎలాగోలా జనాల్లోకి వెళ్లాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఆమధ్య అమరావతి రైతుల యాత్రకు మద్దతవ్వాలని, జనంలోకి వెళ్లాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏపీ బీజేపీ నేతలకు తలంటిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఏపీలో కాషాయదండు దూకుడు పెంచింది. అనుకోకుండా వారికి ప్రజా ఆగ్రహ సభ కలిసొచ్చింది.

ప్రజా ఆగ్రహ సభ సక్సెస్ అయిందా లేదా అనే విషయాన్ని పక్కనపెడితే, చీప్ లిక్కర్ పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన హాట్ కామెంట్స్ మాత్రం బాగా పాపులర్ అయ్యాయి. బీజేపీ అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ ని మరింత చీప్ గా మందుబాబులకి అందిస్తామని హామీ ఇచ్చారు వీర్రాజు. ఆ దెబ్బకి మహిళా సంఘాలు మండిపడ్డాయి, కానీ మందుబాబులు మాత్రం బీజేపీపై సింపతీ చూపిస్తున్నారు. దీనివల్ల ఓట్లు వస్తాయా లేవా అనే విషయం పక్కనపెడితే.. అసలు బీజేపీ పేరు వినిపించని చోట్ల కూడా ఆ  పార్టీ నేతల్ని ఆరాధనగా చూశారు ట్యాక్స్ పేయర్స్. ఈ కథ ఇక్కడితో అయిపోలేదు. ఆ తర్వాత సోము వీర్రాజు, తనకు జరిగిన డ్యామేజ్ ని సరి చేసుకోడానికి వరుసగా ప్రెస్ మీట్లు పెట్టారు, పెడుతూనే ఉన్నారు. దీంతో బీజేపీ ఒక్కసారిగా ఫోకస్ లోకి వచ్చింది.

జనసేనకు ఇబ్బంది..
ఏపీలో కలసి పోటీ చేస్తాం, కలసి కాపురం చేస్తామని చెప్పుకుంటున్నా.. ఒకరిపై ఒకరు పైచేయికోసం జనసేన, బీజేపీ ప్రయత్నిస్తున్నాయి.  అంటే 2024లో ఎవరు ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలి అనే అంశంపై రెండు పార్టీలు మల్లగుల్లాలుప డుతున్నాయి. ఇప్పటినుంచే ప్లాన్లు గీస్తున్నాయి. ఈ దశలో జనసేనను పక్కనపెట్టి బీజేపీ సోలోగా తన పర్ఫామెన్స్ ఇస్తోంది. జనాల్లోకి పార్టీని తీసుకెళ్లాలని ఆల్రడీ అధిష్టానం కూడా కాస్త గట్టిగానే చెప్పింది. దీంతో సోము వీర్రాజు సహా ఇతర నేతలంతా ఆ పనిలోనే ఉన్నారు. దీంతో సహజంగానే ఇది బీజేపీకి ఇబ్బందిగా మారింది. ఎంత మిత్రపక్షం అయినా, తమను తొక్కేయాలని చూస్తుండే సరికి జనసైనికులు కూడా ఇబ్బంది పడుతున్నారు. పవన్ కూడా బీజేపీ దూకుడుతో అలర్ట్ అయ్యారు. బీజేపీతోపాటు, వీలైతే బీజేపీకంటే ఎక్కువగా జనసేన యాక్టివిటీస్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: