ఏపీ సర్కార్‌ పై రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహ రావు షాకింగ్‌ కామెంట్స్ చేశారు.  విశాఖలో కేంద్రం చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణం తీరు పరిశీలనకు రెండు రోజుల పర్యటన నేటితో పూర్తవుతోందని.. ఈ ప్రాజెక్టుల పూర్తికి ఏమి అవసరమో చూసి కేంద్రం దృష్టికి తీసుకువెళతామన్నారు. 441 కోట్లతో గంభీరంలో ఐఐఎం నిర్మాణం సాగుతోందని.. దీన్ని ప్రజలు సందర్శించే అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. 'సమీర్' రీసెర్చ్ సంస్థను కూడా సందర్శించామని.. మెడిటెక్ లో అత్యాధునిక వైద్య సామగ్రి తయారవుతోందన్నారు.  హెచ్.పి.సి.ఎల్ విస్తరణ పనులు కూడా చూశాము. 28 వేల కోట్లతో 15 మిలియన్ టన్నులకు ఉత్పత్తి పెంచుతున్నారని.. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల పూర్తికి సత్వరమే సహకరించాలని డిమాండ్‌ చేశారు.  విశాఖలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల  ప్రస్తుత స్థితిని సమీక్షించామని వెల్లడించారు.  

61 ప్రాజెక్ట్ లు స్మార్ సిటీ లో భాగం గా నిర్మాణ దశలో ఉన్నాయని.. ఆయా ప్రాజెక్టుల గురించి తెలియజేయాలని కమిషనరును కోరామని స్పష్టం చేశారు.  రూ. 940 కోట్లతో నిర్మిస్తున్న డ్రెయినేజి పథకం అనుకున్న టైముకి పూర్తి చేయాలని.. అమృత్ పథకం కింద 24×7 నీటి సరఫరా పథకం వేగంగా పూర్తి చేయాలని, ఇఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి తగిన మౌలిక వసతులు‌ కల్పించాలని కోరామన్నారు.  రూ.18 వేల ప్రధాని ఆవాస్ గృహాలను లబ్ధిదారులకు వెంటనే అప్పగించాలని కోరామని.. రైల్వే జోన్ పనులు జరుగుతున్నాయి. జోన్ కార్యకలాపాలు రానున్న కొద్ది నెలల్లొ మొదలవుతాయన్నారు.  ప్రధాని పసల్ బీమా యోజన అమలు వైసిపి సర్కారు నిలిపివేసిందని.. దానికన్నా ఉత్తమమైంది తెచ్చామన్నారు. దీనిపై సిఎంకు లేఖ రాశానని వెల్లడించారు.  దేశంలో మిర్చిలో 60 శాతం ఉత్పత్తి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోందని.. రైతులను వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు.  మిర్చి రైతులు తెగుళ్ల వల్ల 80 శాతం పంట నష్టపోయారు. పరిహారం ప్రభుత్వం తక్షణం చెల్లించాలని.. ఎకరానికి లక్ష రూపాయల నష్టం వచ్చింది. బీమా ఉన్నా లేకున్నా పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: