తెలుగు రాష్ట్రాల‌లో సంక్రాంతి పండుగ సంద‌డి మొద‌లైన‌ది. ప్ర‌యాణికులు ఇప్ప‌టినుంచే సొంతిళ్లుకు ప‌య‌న‌మ‌వుతున్నారు. పండుగ ర‌ద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేస్తూ ఉన్నారు. పండుగ‌కు 10 రోజుల స‌మ‌యముండ‌డంతో తెలుగు రాష్ట్రాల‌లోని బ‌స్సుల‌ను ప్రాంతాల‌కు సిద్ధం చేసారు. ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌భుత్వం సెల‌వుల‌ను ప్ర‌క‌టించ‌డంతో ప‌ల్లెల‌కు వెళ్లేందుకు ప‌ట్నం వాసులు సిద్ధ‌మ‌వుతున్నారు. ముఖ్యంగా తెలుగు వారికి అతిపెద్ద పండుగ కావ‌డంతో ప్ర‌జ‌లు, విద్యార్థులు అంద‌రూ సొంతూళ్ల బాట ప‌డుతున్నారు. సొంతూళ్ల‌కు వెళ్లే వారితో న‌గ‌రంలో రైళ్లు, బ‌స్సులు కిట‌కిట‌లాడుతూ ఉన్నాయి. ప్ర‌యాణికుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసాయి.

ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆర్టీసీ ప్ర‌త్యేక బ‌స్సుల‌ను ఏర్పాటు చేయ‌నున్నది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల‌లో ప్ర‌త్యేకంగా 6,970 బ‌స్సులు న‌డ‌ప‌నున్న‌ది. సంక్రాంతికి ముందుగా 4,145 బ‌స్సులు పండుగ త‌రువాత 2,825 బ‌స్సులు తిర‌గ‌నున్నాయి. జ‌న‌వ‌రి 8 నుంచి సంక్రాంతి స్పెష‌ల్ బ‌స్సులు ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉండ‌నున్నాయి. స్పెష‌ల్ బ‌స్సుల‌కు 50 శాతం అద‌న‌పు ఛార్జీ వ‌సూలు చేయ‌నున్నారు. హైద‌రాబాద్ నుండి ఏపీలోని ప‌లు ప్రాంతాల‌కు 1500 బ‌స్సుల‌ను ఏపీఎస్ఆర్‌టీసీ న‌డ‌ప‌నుంది. ఈనెల 07 నుంచి 14 వ తేదీ వ‌ర‌కు అందుబాటులో ఉంటాయ‌ని ఏపీఎస్ ఆర్టీసీ డిప్యూటీ సీటీఎం కిశోర్ నాథ్ ఇటీవ‌లే తెలిపారు.

మ‌రొక‌వైపు టీఎస్ార్టీసీ కూడా సంక్రాంతికి ప్ర‌త్యేక బ‌స్సుల‌ను న‌డ‌ప‌నున్న‌ది. సొంతూళ్ల‌కు వెళ్లే ప్ర‌జ‌ల సౌక‌ర్యార్థం 4,360 బ‌స్సుల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు టీఎస్ఆర్టీసీ తెలిపింది. ప్ర‌త్యేక బ‌స్సుల్లో 590 బ‌స్సులకు రిజ‌ర్వేష‌న్ సౌక‌ర్యం క‌ల్పించింది. ఆదిలాబాద్‌, ఖ‌మ్మం, భ‌ద్రాచ‌లం, విజ‌య‌వాడ‌, నెల్లూరు, గుంటూరు, ఒంగోలు ప‌ట్ట‌ణాల‌తో పాటు క‌ర్నాట‌క, మ‌హారాష్ట్రల‌కు బ‌స్సుల‌కు రిజ‌ర్వేష‌న్ సౌక‌ర్యం ఉండ‌నున్న‌ది. టీఎస్ఆర్టీసీ మాత్రం ఏవిధ‌మైన అద‌న‌పు ఛార్జీల‌ను వ‌సూలు చేయ‌డం లేదు. తెలంగాణ ఆర్టీసీ నిర్ణ‌యం ప్ర‌జ‌ల సంతోషం వ్య‌క్తం చేస్తూ ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: