తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు ప్రస్తుతం దేశంలో కరోనా పరిస్థితులపై నిన్న కీలక సూచనలు చేశారు. కోఠిలోని ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన వైరస్ పరిస్థితుల గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.  రానున్న నాలుగు వారాల వరకు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రధానంగా పేర్కొన్నారు.  భారత్ లో ఓ వైపు డెల్టా వేరియంట్ వ్యాప్తి తగ్గలేదు, మరో వైపు కొత్తగా వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ యొక్క వ్యాప్తి వేగం మొదలైపోయింది. ప్రమాదం రోజురోజుకు పెరుగుతోంది. ఇది నిజంగా గడ్డు కాలం, జాగ్రత్త తప్పనిసరి.  తెలుగు రాష్ట్రాల్లోనూ ముప్పు పొంచి ఉంది. 

తెలంగాణలో నిత్యం నాలుగు రెట్లు అధికంగా కొత్త కేసులు నమోదు అవుతుండటం ఆలోచించాల్సిన విషయం. జనవరి నెల చివరి వారంలో కొత్త కేసులు భారీగా పెరిగి, ఫిబ్రవరి నెల చివర్లో మళ్ళీ కేసులు తగ్గుముఖం పట్టే  అవకాశం ఉందని పేర్కొన్నారు.  కావున ఇప్పుడు ప్రజలందరూ కూడా మునుపటి విషమ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త పడాలి. వైరస్ కు దూరంగా ఉండాలి, అంటే నిబందనలను తప్పక పాటించాలని అన్నారు. రాజకీయ పార్టీలు, సినీ పరిశ్రమకు సంబందించిన ప్రజా కార్యక్రమాలు,  ప్రజాసంఘాలు వంటి వాటిని వచ్చే నాలుగు వారాల పాటు రద్దు చేసుకోవాలని, అలా అయితేనే వైరస్ ను అదుపు చేయగలమని  కావున అందరూ సహకరించాలని డీహెచ్ కోరారు. దీన్ని ప్రజా పాలకులు అయిబా రాజకీయ పార్టీలు అయినా చాలా బాధ్యతగా తీసుకోవాలని ప్రజల ప్రాణాలకు సంబందించిన విషయం అయినందున చాలా సీరియస్ గా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందని ఆయన అన్నారు.  

బహిరంగ సభలు, పలు రకాలుగా ప్రజలు ఒక చోట గుమికూడేలా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కేసులు పెరిగే అవకాశం చాలా ఉంటుందని, అందుకనే ముందు జాగ్రత్త అత్యంత అవసరమని సూచించారు . ముఖ్యంగా రాజకీయ నాయకులు నిత్యం ప్రజలతో టచ్ లో ఉంటారు కావున ప్రస్తుత వైరస్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వైరస్ వ్యాప్తి పెరిగే కార్యక్రమాలను మరో నాలుగు వారాల పాటు రద్దు చేసుకోవటం ఉత్తమం అని ఆయన అన్నారు. మరి త్వరలోనే ఒమిక్రాన్ వ్యాప్తి తగ్గిపోయి మునుపటి లాగా సంతోషంగా ఉండాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: