అర్థం చేసుకోండి, పరిస్థితుల్ని అవగాహన చేసుకోండి అంటూ ఉద్యోగులకు ఉపదేశం ఇచ్చారు సీఎం జగన్. గతంలో ఎప్పుడూ ఆయన ఇలా ప్రెస్ మీట్లో మాట్లాడినట్టు లేదు. ఉద్యోగ సంఘాలతో చర్చల అనంతరం జగన్ మాట్లాడిన తీరు ఇప్పుడు ఏపీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. తన చేతికి ఎముకలేదని అంటారని, తాను ఎవరికీ ఎప్పుడూ తక్కువ చేసింది లేదని అంటూనే పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలంటూ పరోక్షంగా పీఆర్సీపై హింట్ ఇచ్చారు జగన్.

ఉద్యోగులు అర్థం చేసుకుంటారా..?
ప్రతిపక్షనేతగా జగన్ పాదయాత్ర సమయంలో ఉద్యోగులకు భారీగానే హామీలిచ్చారు. సీపీఎస్ రద్దు హామీ ఇచ్చారు. పీఆర్సీ విషయంలో ఉదారంగా ఉంటామన్నారు. ఉద్యోగులు కూడా ఆయనపై అలాంటి అంచనాలే పెట్టుకున్నారు. కానీ సీపీఎస్ రద్దు విషయానికి ఆదిలోనే బ్రేక్ పడింది. రెండేళ్లు పూర్తయినా ఇంకా సీపీఎస్ రద్దు చేస్తారనే ఆశ లేదు, అసలు భవిష్యత్తులో అయినా రద్దు ఉంటుందా అనేది డౌటే. పోనీ సీపీఎస్ రద్దు చేయకపోతే పోయారు, కనీసం పీఆర్సీ అయినా ఘనంగా ప్రకటిస్తారా అంటే ఇది కూడా డైలమాలో పడింది. ఇప్పుడు జగన్ మాటలు వింటుంటే మాత్రం ఉద్యోగులకు ఏం చేయాలో అర్థం కావడంలేదు.

లాజిక్ తో కొట్టిన జగన్..
గతంలో స్ట్రైట్ ఫార్వార్డ్ గా మాట్లాడే జగన్, ఇప్పుడు మాత్రం లాజిక్ తో కొడుతున్నారు. పరిస్థితుల్ని అర్థం చేసుకోండి అంటూ జగన్ మాట్లాడటం చూస్తుంటే పీఆర్సీ ఆశించిన స్థాయిలో ఉండదనే విషయం అర్థమవుతోంది. అయితే జగన్ మాత్రం భవిష్యత్తుపై ఆశలు కలిగించేలా మాట్లాడారు. సాయం చేస్తే భారీగానే చేస్తానంటూ, తన చేయికి ఎముకలేదని అంటుంటారని గుర్తు చేశారు జగన్.

భవిష్యత్తుపై ఉద్యోగులకు ఆశలున్నాయా..?
వాస్తవానికి సీఎం జగన్ కి కూడా ఉద్యోగులతో కయ్యం పెట్టుకోవడం ఇష్టంలేదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఇటు సంక్షేమ కార్యక్రమాలకు నిధులు కేటాయించాల్సి రావడంతో ఉద్యోగులకు ఆ మేర జీతాలు పెంచే అవకాశం లేకుండా పోయింది. అయితే దీన్ని ఉద్యోగులు అర్థం చేసుకుంటారా, లేక నిరసనలకు దిగుతారా అనేది తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: