తిడితే తిట్టించుకో కొడితే కొట్టించుకో
అయినా కూడా ఆయ‌న త‌గ్గ‌రు
త‌గ్గ‌కూడదు అన్న‌ది ఆయ‌న నిర్ణ‌యం
బూతులు తిడితే క్రేజ్ వ‌స్త‌ది
ఆర్జీవీ మాదిరిగా ఏం మాట్లాడినా
క్రేజ్ వ‌స్తది.......................................ద‌టీజ్ కొడాలి నాని


పెరుగుతున్న ధ‌ర‌ల‌కు సంబంధించి వివిధ మార్కెట్ల‌లో ఉన్న ధ‌ర‌ల‌కు సంబంధించి ఈనాడులో వ‌చ్చిన క‌థ‌నం త‌ప్పు అని చెప్పాలి.త‌మ శాఖ ఆధ్వ‌ర్యంలో ధ‌ర‌ల‌ను నియంత్రించేందుకు తీసుకుంటున్న చ‌ర్య‌లు ఫ‌లితం ఇస్తున్నాయ‌ని చెప్పాలి.ఇవేవీ కాకుండా మంత్రి నానీ నిన్న కూడా బూతులు తిట్టారు.తిట్టి ఏం సాధిస్తారు స‌ర్ అని అంటే అంతెత్తున లేచారు.ఆయ‌న‌ను నియంత్రించేందుకు మ‌రో మంత్రిత్వ శాఖ‌ను నియ‌మించండి..బూతుల నియంత్ర‌ణ శాఖ అని ఒక‌టి నియ‌మించుకోండి..ఏం కాదు..ఇంత‌గా రాష్ట్రంలో ఏ నాయ‌కుడూ దిగ‌జారి మాట్లాడిన దాఖ‌లాలే లేవు.ఒక‌ట్రెండు సంద‌ర్భాల్లో నాయ‌కులు నోరు జారిన సంద‌ర్భాలు అయితే ఉన్నాయి.. ఆయా వేళ‌ల్లో కూడా సంబంధిత బాధ్యులు మీడియా ముఖంగా క్ష‌మాప‌ణ‌లు చెప్పిన రోజులూ ఉన్నాయి.



ఇవి కాకుండా రాజ‌కీయంలో మ‌రికొన్ని ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం అయిన రోజులూ ఉన్నాయి.కానీ కొడాలి నానీ ప‌ద్ధ‌తికి ఇక్క‌డెవ్వ‌రూ ఎదురు చెప్ప‌లేరు.అడ్డగించ‌లేరు ఆయ‌న‌ను.ఆయ‌నేం చేసినా విని ఊరుకోవ‌డం ఓ ఉత్త‌మ రీతి.జ‌గ‌న్ ద‌గ్గ‌రుండి తిట్టిస్తున్నార‌ని చాలా మంది వైసీపీ నాయ‌కులే బాహాటంగా మాట్లాడిన సంద‌ర్భాలూ ఉన్నాయి.అంత చెడ్డ సంస్కారం ఓ పార్టీ అధినేత‌కు ఉంద‌ని బుద్ధి ఉన్న‌వారెవ్వ‌రూ అనుకోరు కానీ వ‌రుస ప‌రిణామాలు చూస్తుంటే,ఆయ‌న గారి శ్రీ‌నాథ క‌విత్వం వింటూ ఉంటే సీఎంపై వ‌స్తున్న అనుమానాలు మ‌రియు ఆరోప‌ణ‌లు నిజ‌మే అని కూడా అనిపిస్తున్నాయి.


మంచి భాష మంచి వ్య‌క్తిత్వానికి ప్రామాణికం అని ఎన్ని సార్లు చెప్పినా అర్థం కాని స్థితిలో ఇవాళ కొంద‌రు వైసీపీ నాయ‌కులు ఉన్నారు. ఆ విధంగా వాళ్లు త‌మ‌ని తాము గొప్ప వాళ్ల‌మ‌ని అనుకుంటూ ఉన్నారు.దీంతో వీరి ప్ర‌భావం మిగ‌తా వైసీపీ నాయ‌కుల పై ప‌డుతోంది.ముఖ్యంగా నిన్న‌టివేళ ధ‌ర‌ల‌కు సంబంధించి బూతులు తిట్టి మ‌రి ప్ర‌సంగం చెప్పిన కొడాలి నాని తీరుపై మ‌ళ్లీ ఏపీలో  రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు రేగుతున్నాయి.ప్ర‌క‌ట‌న‌లు వెల్లువెత్తుతున్నాయి.ఈ నేప‌థ్యంలో మ‌ళ్లీ నానీ భాష చ‌ర్చ‌కు వచ్చింది.



మరింత సమాచారం తెలుసుకోండి: