కరోనాకు మోల్నుపిరావిర్ తో చెక్ పెట్టొచ్చని అందరూ అనుకుంటుండగా ఐసీఎమ్ఆర్ షాకింగ్ వార్త చెప్పింది. ఆ మాత్రలతో తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముందని..అందుకేదీన్ని భారత్ లో కరోనా చికిత్సలో చేర్చలేదని తెలిపింది. దీన్ని గర్భిణులు వాడితే..శిశువులకు అంగవైకల్యం వస్తుందన.. పాలిచ్చే తల్లులు వాడితే పిల్లల కండరాలపై ప్రభావం ఉంటుందని తేల్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూకే కూడా దీన్ని కొవిడ్ చికిత్సలో చేర్చలేదని తెలిపింది.

మరోవైపు జన్యుక్రమ విశ్లేషణ అవసరం లేకుండా పరీక్ష సమయంలోనే నేరుగా ఒమిక్రాన్ వేరియంట్ ను గుర్తించే ఒమిస్యూర్ కిట్ ను టాటా మెడికల్ అండ్ డయాగ్నొస్టిక్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ రూపొందించింది. ఆర్టీపీసీఆర్ టెస్ట్ సమయంలోనే ముక్కు లేదా గొంతు నుంచి తీసుకున్న శాంపిల్ లో ఒమిక్రాన్ సహా ఇతర వేరియంట్లను కూడా ఈ కిట్ గుర్తిస్తుంది. అయితే డిసెంబర్ 30న ఐసీఎమ్ఆర్ ఆమోదం లభించింది.

ఇక కొవిడ్ చికిత్సలో వాడటానికి కొత్త ఔషధం త్వరలోనే అందుబాటులోకి రానుంది. ప్రముఖ సంస్థ ఫైజర్ అభివృద్ధి చేసిన పాక్స్ లోవిడ్ ను అమెరికా, బ్రిటన్ దేశాలు ఆమోదించాయి. దీంతో వివిధ దేశాలు ఫైజర్ తో ఔషధ కొనుగోలుకు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఈ మందు కరోనా వేరియంట్లపై బాగా పనిచేస్తోందని పైజర్ ప్రకటించింది.

మరోవైపు మన దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో ఏకంగా లక్షా 17వేల 100కొత్త కేసులు వచ్చాయి. కరోనా బారిన పడి మరో 302మంది మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 4లక్షల 83వేల 178కు చేరింది. దేశవ్యాప్తంగా పాజిటివిటీ రేటు 7.74శాతం కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 3లక్షల 71వేల 363 యాక్టివ్ కేసులున్నాయి. ఇక నిన్న 90వేల కేసులు రాగా.. ఒక్కరోజులోనే 27వేల కేసులు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.  మొత్తానికి ప్రజలు కరోనా చికిత్సకు వాడే మందుల విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది.













మరింత సమాచారం తెలుసుకోండి: