కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న ఈ క్లిష్ట సమయంలో గంగా సాగర్ మేళా నిషేధంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పరిశీలించాలని హైకోర్టు పేర్కొంది. రాష్ట్రంలో గత 10రోజుల్లో కరోనా కేసులు రోజువారీ సంఖ్య 16రెట్లు పెరిగింది. గత మంగళవారం ఒక్కరోజే పశ్చిమబెంగాల్ లో 9వేల 73కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా..జనవరి 7న జరగాల్సిన 27వ కోల్ కతా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాన్ని వాయిదా వేసింది పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం.

దేశంలో కరోనాతో పాటు ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 3వేల 7కు చేరింది. అత్యధికంగా మహారాష్ట్రలో 876కేసులు, ఢిల్లీలో 465, కర్ణాటకలో 333, రాజస్థాన్ లో 291, కేరళలో 284, గుజరాత్ లో 204, తమిళనాడులో 121 కేసులు, తెలంగాణలో 107, ఏపీలో 28కేసులు నమోదయ్యాయి.  ఇప్పటి వరకు 1, 199మంది ఒమిక్రాన్ నుంచి కోలుకున్నారు.

గతేడాది డిసెంబర్ చివరి వారంలో దేశంలో నిత్యం నమోదైన కేసుల సంఖ్య 10వేల లోపే. కానీ ప్రస్తుతం సంఖ్య లక్షకు చేరువైంది. అంటే వైరస్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది రోజువారీ కేసుల సంఖ్యను చూస్తే.. జనవరి 1న 22వేల 775, జనవరి 2న 27వేల 553, జనవరి 3న 33వేల 750, జనవరి 4న 37వేల 379, జనవరి 5న 58వేల 097, జనవరి 6న 90వేల 928గా ఉంది. మరోవైపు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి సైతం కోవిడ్ బారిన పడ్డారు.

ముఖ్యంగా ముంబైలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా విలయ తాండవం చేస్తోంది. 24గంటల వ్యవధిలోనే అక్కడ 20వేల 181 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ బారిన పడి నలుగురు మరణించారు. ఈ మేరకు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బులిటెన్ విడుదల చేసింది. అక్కడి స్లమ్ ఏరియా ధారావిలో 107మందికి ఈ వైరస్ సోకింది. ప్రస్తుతం ముంబైలో 79వేల 260యాక్టివ్ కేసులున్నాయి.






 




మరింత సమాచారం తెలుసుకోండి: