ఒక‌టి కాదు రెండు కాదు మూడు మీడియాల‌ను నిషేధించాల‌ని మంత్రి కొడాలి నాని చెబుతున్న మాట‌లు పెద్ద‌గా న‌ప్పేలా లేవు. ఆయ‌న మాట జిల్లాల‌లో పాటింపు ఉంటుంద‌ని కూడా అన‌లేం.ఈ మాట స‌జ్జ‌ల చెప్పినా ప‌ట్టించుకోని స్థితిలో వైసీపీ ఉంది.ఎందుకంటే ఇప్ప‌టికీ సాక్షి మీడియా క‌న్నా ఈనాడు మీడియాకే వైసీపీ నాయ‌కుల ప్ర‌క‌ట‌న‌లు ఎక్కువ‌గా వెళ్తున్నాయి.ఈపాటి కూడా నిలువ‌రించ‌లేని జ‌గ‌న్,ఆయా మీడియాల‌పై నిషేధం విధించి ఏం సాధిస్తార‌ని? మంత్రి నాని చెప్పిన విధంగానే జ‌రిగిందే అనుకుందాం అప్పుడు ప్ర‌త్యక్ష యుద్ధం ప్ర‌త్యేక రీతిన జ‌రిగేందుకు ఛాన్స్ ఉందా? కృష్ణా జిల్లాకు చెందిన పెద్ద‌మ‌నిషి అదే ప్రాంతానికి చెందిన,అందునా! సొంత సామాజిక‌వ‌ర్గంకు చెందిన మంత్రిని టార్గెట్ చేస్తూ వ‌రుస క‌థ‌నాలు రాయించ‌గ‌ల‌రా? రాయిస్తే సంతోష‌మే! అప్పుడు రామోజీ స‌చ్ఛీల‌త ఎంత‌న్న‌ది తేలిపోతుంది! మ‌హా అయితే పౌర స‌ర‌ఫ‌రాల శాఖ (నాని నిర్వ‌హిస్తున్న శాఖ‌)లో ఉన్న లొసుగుల‌కు అధికారుల‌ను బాధ్యులను చేస్తూ, తీరం దాటిపోతున్న స‌ర్కారు బియ్యం క‌హానీ మాత్రం రాయించి  చేతులు దులుపుకోవ‌డం రామోజీకి తెలిసిన విద్య కావొచ్చు.అంత‌కుమించి రామోజీ కానీ కొడాలి నానీ కానీ జ‌గ‌న్ కానీ సాధించేదేమీ ఉండ‌దు.నిషేధం ఓ నాటకం...న‌మ్మకండి ప్ర‌జ‌లారా!


ఈనాడు మీడియాకూ జ‌గ‌న్-కూ మ‌ధ్య ఏ వివాదం లేదు.ఆ మాట‌కు వ‌స్తే ఈనాడు మీడియా గ‌తంలో మాదిరిగా పెద్ద‌గా ప్ర‌భుత్వం పై పోరాట‌మే చేయ‌డం లేదు.ఎందుకంటే ఆ రెండు వ‌ర్గాల‌కూ మ‌ధ్య స‌యోధ్య కుదిర్చిన వారంతా ఇవాళ జ‌గ‌న్ స‌ర్కారులో ఉన్నా రు క‌నుక.అంతేకాదు కేసీఆర్ పై కూడా ఈనాడు నీడ అస్స‌లు ప‌డ‌డం లేదు.క‌నుక కేసీఆర్ కు ఈనాడు నీడ అంటే పెద్ద‌గా విభేదం లేకుండా పోయింది.ఈనాడు నీడ అంటే కొడాలికి కూడా ఇష్ట‌మే కానీ సొంత సామాజిక‌వ‌ర్గాన్నే వ్య‌తిరేకించారు అన్న మాట ఒక‌టి లోకంలోకి వెళ్లాలి అన్న తాప‌త్ర‌యంలో భాగంగా ఈనాడును కానీ త‌న స్నేహితుడు అయిన రాధాకృష్ణాకు చెందిన మీడియాను కానీ పైకి తిట్టినా లోప‌ల ఒక అంత‌ర్మ‌థ‌నం అయితే ఉంటుంది.ఇదంతా జ‌గ‌న్ మెప్పు కోసమే అన్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్యం.



త‌ప్పులు ఉంటే దిద్దాలి.. ప్ర‌క‌ట‌న‌లు ఆపి వ్య‌తిరేక మీడియాపై కోపం చూపించుకోవాలి.త‌ప్పులు దిద్దే ప్ర‌య‌త్నం జ‌గ‌న్ స‌ర్కారు చేయ‌దు.పోనీ ప్ర‌క‌ట‌న‌లు ఆపి ఆర్థిక మూలాలు ఇబ్బంది ప‌డేలా చేయ‌దు గాక చేయ‌దు.అలాంట‌ప్పుడు పై పై నోటి తుంప‌రులు లేదా నీటి తుంప‌ర‌ల కోసం మాట్లాడేదెందుకు? వీటివ‌ల్ల ఏం ఫ‌లితం ఉంటుంద‌ని?


అవాస్త‌వాలు రాస్తున్నార‌న్న ఆలోచ‌న‌తో ఈనాడు మొద‌లుకుని టీవీ5 దాకా ఉన్న మీడియాల‌ను నిషేధిస్తున్నామ‌ని మంత్రి కొడాలి నాని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.ధ‌ర‌ల‌కు సంబంధించి ఈనాడులో వ‌చ్చిన క‌థ‌నానికి కౌంట‌ర్ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో చాలా వ్యాఖ్య‌లు చేశారు.వైసీపీకి చెందిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈనాడు,ఈటీవీ,ఆంధ్ర‌జ్యోతి (ప్రింట్ అండ్ ఎల‌క్ట్రానిక్),టీవీ5 మీడియాల‌ను నిషేధిస్తున్నామ‌ని అన్నారు.అంటే ఇప్పుడు టీవీ9పై నిషేధం లేద‌న్న మాట. అన్న‌మాట కాదు ఉన్న మాటే! ఎందుకంటే యాజ‌మాన్యాలు ప్ర‌భుత్వానికి అనుకూలంగా ఉంటే ఓ విధంగా లేకుంటే మ‌రో విధంగా ప్ర‌భుత్వ పెద్ద‌ల న‌డవడి, నియ‌మం అన్న‌వి ఆధార‌ప‌డి ఉంటాయ‌ని మ‌రోసారి నిరూపించారు నాని.ఆ రోజు చంద్ర‌బాబు నేతృత్వంలో న‌డిచి న ప్ర‌భుత్వంలో సాక్షి మీడియాను చాలా మీడియా స‌మావేశాల్లో నుంచి పంపించేశారు.ఇప్పుడు అదే కోపంతో నాని కూడా వ్య‌తి రేక మీడియా పై నిషేధం విధించి తాము మార‌మ‌ని,మార‌బోమ‌ని కూడా చెప్పేశారు. మ‌రి! ఆ నిషేధాజ్ఞ అమ‌లు ఎందాకో?




మరింత సమాచారం తెలుసుకోండి: