ఆంధ్ర  ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజా మరోసారి  ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమైనట్లు సమాచారం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ,  ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరైనట్లు తెలిసింది. ఇంతకీ ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో ఎందుకు సమావేశమయ్యారు.
ఆంధ్ర ప్రదేశ్ ఆదాయం తగ్గుతోంది, ఉద్యోగుల జీత భత్యాల వ్యయం పెరుగుతోంది. ఇది ప్రభుత్వానికి భారం. ఈ భారం అందరిదీ దీనిని సానుకూలంగా అర్థం చేసుకోవాలి అని ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి  ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో గురువారం పేర్కోన్నారు. అంతే కాదు మరో రెండు రోజుల్లో పిఆర్సీ పై ప్రకట చేస్తామని కూడా  ప్రకటించారు. అందరూ ప్రాక్టికల్ గా ఆలోచించాలని, రాష్ట్ర భవిష్యత్తును  దృష్టిలో పెట్టుకుని తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని ముఖ్యమంత్రి కోరారు. ఉద్యోగ సంఘాల నేతలు చెప్పిన విషయాలను, లేవనెత్తిన సమస్యలను తానే స్వయంగా నోట్ చేసుకున్నారు.  వాస్తవాలను పరిగణలోకి తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాలను కోరారు. దీంతో తొలి రోజు సమావేశం ముగిసింది. మరో సారి ముఖ్యమంత్రితో భేటీ ఉండక పోవచ్చని ఉద్యాగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. సిఎం సానుకూలంగా స్పందిస్తారనే తాము భావిస్తున్నామని వారు బహిరంగంగా పేర్కోన్నారు.  అదే సమయంలో వారు  జనవరి 9 వ తేదీ డెడ్ లైన్ విధించిన అంశాన్ని కూడా గుర్తు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం అర్థిక శాఖ కార్యదర్శులతో సమావేశం అయినట్లు తెలిసింది. నిన్నటి సమావేశంలో  ఉద్యోగ సంఘాల ప్రతినిధలు  లేవనెత్తిన అంశాలు, వాటి వల్ల ఏపి ఖజానా పై పడే భారం ఇత్యాది అంశాలను  ముఖ్యమంత్రి చర్చించనున్నట్లు అధికార వర్గాల సమాచారం. ఇంతే కాకుండా ఓమిక్రాన్ విరుచుకు పడుతున్న నేపథ్యంలో  ఆరోగ్య శాఖ కు కేటాయించాల్సిన నిధుల పై ముఖ్యమంత్రి వివరణ కోరారని అధికారులు పేర్కోంటున్నారు. గతం లో కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి వెచ్చించిన నిధులు ఎంత ? ప్రస్తుతం వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో  ఈ దఫా ఎంత కేటాయించాలని తదితర  విషయాలపై కూడా  ముఖ్యమంత్రి అధికారులతో చర్చించనున్నట్లు తెలిసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: