ఆంధ్ర ప్రదేశ్ లోని ఉభయ గోదావరి జిల్లాల వ్యవసాయాధారిత ప్రజలకు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావడం ఎంత ముఖ్యమో తెలిసిందే. అయితే దీనిని పూర్తి చేయడానికి ఇంకా సమయం పట్టేలా ఉంది. ఏళ్ల తరబడి పోలవరం ప్రాజెక్ట్ వెనక్కి పోతూనే ఉంది. జగనన్న ప్రభుత్వం వచ్చాక 2022 ఏప్రిల్ నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని డెడ్ లైన్ పెట్టుకోగా ఇపుడు అది కూడా వాయిదా పడేలా ఉంది. గత కొన్ని రోజులుగా ఈ భారీ ప్రాజెక్ట్ పనులు ఆగుతున్నాయని, నిధుల జాప్యం వలన మందకొడిగా సాగుతున్నాయని పలు రకాల వార్తలు వింటూనే ఉన్నాం. అయితే ఇపుడు ఈ ప్రాజెక్ట్ కు సంబందించిన మరో తాజా వార్త ఆంధ్రులకు ఆందోళన కలిగిస్తోంది.

ఈ విషయంపై కేంద్ర మంత్రి కీలక ప్రకటన చేశారు. వాస్తవానికి ప్రభుత్వం ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి వచ్చే ఏడాది ఏప్రిల్‌ ను లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, పలు కారణాల వలన ఈ ప్రాజెక్ట్ మరింత ఆలస్యమవుతుందని  తాజాగా తెలిపారు కేంద్ర మంత్రి. ఓ వైపు ప్రస్తుత పనులు ప్రాజెక్ట్ నిర్మాణ స్థితి షెడ్యూల్‌కు అనుగుణంగా ఉన్నట్లు కనిపించడం లేదు అంటూ వార్తలు వెల్లువెత్తుతున్న క్రమంలో ఈ ప్రకటన రావడంతో ఈ అంశంపై క్లారిటీ వచ్చింది.
2017-18 ధరల ప్రకారం ప్రాజెక్టు కొరకు కేంద్రం నిధుల మంజూరుకు అనుమతి అలాగే ఆర్ధిక పెట్టుబడి ఇవ్వాలంటే  ఎప్పటికి ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేయగలరో అన్న స్పష్టమైన ప్రణాళిక మరియు కొత్త షెడ్యూలు ను ఇవ్వాలని అథారిటీ పోలవరం ప్రాజెక్టు కు షరతు విధించింది.

ఈ కారణంగా అధికారులు నూతన షెడ్యూలు ను తయారు చేయడంలో నిమగ్నమయ్యారు. వీలైనంత త్వరలో ఈ ప్రాజెక్ట్ కొత్త షెడ్యుల్ ను కేంద్రానికి ఇవ్వనున్నారు. ఇక పునరావాసం పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి. పునరావాస కాలనీలు పూర్తి చేయడానికి ఎన్నో అడ్డంకులు...దిగువ కాఫర్‌ డ్యాం నిర్మాణ పనులు కూడా జాప్యం జరుగుతూనే ఉంది. అయితే ఈ ప్రాజెక్టు ఇంకా ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారు. ఇక రైతులు ఎంతో కాలం నుండి పోలవరం ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. మరి వీరి కష్టాలు ఎప్పుడు తీరనున్నాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: