ఇంకా చంద్రబాబు జీవితంలో సీఎం కాలేరా? అసలు జగన్‌ని గద్దె దించే సత్తా బాబుకు లేదా? అంటే లేదనే మంత్రి కొడాలి నాని అంటున్నారు. పైగా చంద్రబాబు జీవితంలో సీఎం అవ్వలేరంటూ సవాల్ కూడా చేస్తున్నారు. మామూలుగానే బాబుపై కొడాలి నాని ఏ విధంగా ఫైర్ అవుతారో అందరికీ తెలిసిందే. తనదైన శైలిలో విరుచుకుపడుతుంటారు. అసలు బాబు పని అయిపోయిందని మాట్లాడతారు. అలాగే తాజాగా కూడా కొడాలి నాని బాబుని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబుకు జీవిత కాలం టైమ్ ఇస్తున్నానని...ఈలోపు జగన్‌ని గద్దె దించి చంద్రబాబు సీఎం అయితే తాను రాజకీయాల నుంచి తప్పుకోవడమే కాకుండా...అసలు రాష్ట్రం నుంచే వెళ్లిపోతానని మాట్లాడారు. సరే రాజకీయాల్లో కాన్ఫిడెన్స్ ఉండొచ్చు గానీ..ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. అయితే కొడాలిది కాన్ఫిడెన్సా లేకా ఓవర్ కాన్ఫిడెన్సా అనేది ఇప్పుడే తెలియదు...నెక్స్ట్ ఎన్నికల్లోనే తెలుస్తోంది.

కానీ ఇప్పుడున్న పరిస్తితుల్లో మళ్ళీ జగన్ ఈజీగా గెలిచి అధికారంలోకి రావడం సులువైన పని కాదు. ఈ సారి గెలవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. పైగా ఇప్పుడు రాష్ట్రంలో పరిస్తితులు జగన్‌కు వ్యతిరేకంగా వెళుతున్నాయి. ఇలాంటి పరిస్తితుల్లో కొడాలి నాని ఎందుకు అంత కాన్ఫిడెన్స్‌గా మాట్లాడుతున్నారని అందరికీ డౌట్ వస్తుంది. కొడాలి నాని అనే కాదు పలువురు వైసీపీ నేతలు ఇలాగే మాట్లాడుతున్నారు...జగన్ మరో 30 ఏళ్ళు సీఎంగా ఉంటారని అంటున్నారు. అంటే 30 ఏళ్ళు సీఎంగా కొనసాగడం అంత ఈజీనా అంటే కాదనే చెప్పాలి.

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. కానీ కొడాలి మరీ కాన్ఫిడెన్స్‌తో మాట్లాడుతుండటంతో తెలుగు తమ్ముళ్ళు డౌట్ పడుతున్నారు. కొడాలి మాటల వెనుక చాలా అర్ధం ఉందని, వారేదో స్కెచ్ వేసి ఉంటారని, ప్రశాంత్ కిషోర్‌తో వ్యూహాలు పన్ని బాబుని మళ్ళీ ఓడించడానికి చూస్తున్నారని, ఇందులో ఏదో మతలబు ఉందని అంటున్నారు. మరి కొడాలి మాటలు నిజమవుతాయో లేదో తెలియాలంటే నెక్స్ట్ ఎన్నికల వరకు ఆగాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

tdp