అధికార పార్టీ అన్నాక ఆధిపత్య పోరు సహజమే...సొంత పార్టీలోని నేతలు...ఎవరికి వారు ఆధిపత్యం చెలాయించాలని చూస్తూ ఉంటారు. అయితే ఇది మరింత ముదిరితే రాజకీయంగా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అధికార వైసీపీకి కూడా అదే పరిస్తితి ఎదురవుతుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో వైసీపీలో ఆధిపత్య పోరు నడుస్తోంది. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు, ఎంపీలకు పడటం లేదు...మరి కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు, మంత్రులకు పడటం లేదు...అలాగే ఇంకో చోట ఎమ్మెల్యేలకు...ఎమ్మెల్సీలకు పడదు. ఇంకా ఎమ్మెల్యేలకు..స్థానిక ప్రజా ప్రతినిధులకు పడని పరిస్తితి. సీనియర్ ఎమ్మెల్యేలకు, జూనియర్ మంత్రులకు పడక పోవడం ఇలా అనేక రకాలుగా వైసీపీలో రచ్చ నడుస్తోంది.

చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్తితి. అయితే మొదట నుంచి నెల్లూరు జిల్లాలో యువ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు ఇతర వైసీపీ ఎమ్మెల్యేలకు పెద్దగా పొసగడం లేదనే సంగతి తెలిసిందే. ముందు నుంచి ఈ రచ్చ జరుగుతూ వస్తుంది. మామూలుగానే జిల్లాలో రెడ్డి వర్గం హవా ఎక్కువ ఉంటుందనే సంగతి  తెలిసిందే. అందులోనూ రెడ్డి వర్గంలో ఎమ్మెల్యేలు ఎక్కువ. ఆ రెడ్డి వర్గం ఎమ్మెల్యేలకు..అనిల్ కుమార్ యాదవ్ అంటే కాస్త పడని పరిస్తితి నడుస్తోంది. చాలా సందర్భాల్లో రెడ్డి ఎమ్మెల్యేలు బహిరంగంగానే అనిల్‌పై విమర్శలు చేశారు. మొదట్లోనే సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి...అనిల్‌పై ఫైర్ అయ్యారు. పలు నీటి ప్రాజెక్టుల్లో అవినీతి జరుగుతుందని మాట్లాడారు.

ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిలు సైతం బహిరంగంగా విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి..జిల్లా మంత్రులు పరోక్షంగా విమర్శలు గుప్పించారు. నెల్లూరు పెన్నానది ఒడ్డున జగనన్న లే అవుట్‌ విషయంలో ఆయన ఫైర్ అయ్యారు. చిన్న వర్షానికే అది మునిగిపోతుందని, అసలు అలాంటి చోట లే అవుట్‌కు పర్మిషన్ ఎందుకు ఇచ్చారని అధికారులపై ఫైర్ అయ్యారు. అలాగే కొందరు మంత్రులు వల్ల కావలి భ్రష్టుపోతుందని అన్నారు. ఇలా పరోక్షంగా రెడ్డి ఎమ్మెల్యేలు అనిల్‌నే టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: