స‌మాన ప‌నికి స‌మాన వేత‌నం ఇచ్చే స్థితిలో ప్ర‌భుత్వాలు లేవు కానీ కాస్తో కూస్తో జీతాలు పెంచి శ్రామిక వ‌ర్గాల‌ను ఆదుకోవాల్సిన  అవ‌స‌రం ఎంతైనా ఉంది.పెరుగుతున్న ధ‌ర‌లు, చుట్టూ నెల‌కొంటున్న అనారోగ్య ప‌రిస్థితులు ఇవ‌న్నీ  దృష్టిలో ఉంచుకుని అయినా వీరికి న్యాయం చేయాలి..కేటీఆర్ కాస్త చేశారు.. ఇంకాచేయాలి. అదే స‌మ‌యంలో మిగ‌తా ప్ర‌భుత్వాలూ వీరి విష‌య‌మై క‌రుణ చూపాలి.. స్వ‌చ్ఛ్ భార‌త్ మిష‌న్ పేరిట  హంగామా చేస్తున్న కేంద్రం వీరికి ఎప్ప‌టిక‌ప్పుడు ఉత్త‌మ కార్మికుల‌ను ఎంపిక చేసి ప్రోత్సాహ‌కాలు అందించాలి..ఇవేవీ లేకుండా నేను మీకు ధ‌న్యవాదాలు చెబుతున్నాన‌ని ప్ర‌ధాని చెప్పినా జ‌గ‌న్ చెప్పినా అవ‌న్నీ నోటి తుంప‌ర‌లే!

పారిశుద్ధ్య కార్మికుల జీతాల పెంపున‌కు సంబంధించి తెలంగాణ ప్ర‌భుత్వం నుంచి వ‌చ్చిన ఓ కీల‌క నిర్ణ‌యం కార‌ణంగా ఆ రాష్ట్రంలో ఆ నందోత్సాహాలు వ్య‌క్తం అవుతున్నాయి.ఇదే స‌మ‌యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇప్ప‌టిదాకా త‌మ విష‌య‌మై చూపిస్తున్న వివ‌క్ష లేదా అశ్ర‌ద్ధ కొన‌సాగుతుంద‌ని మండి ప‌డుతున్నాయి సంబంధిత వ‌ర్గాలు.ప‌ట్ట‌ణ ప‌రిధిలో ప‌నిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల జీతాలు మ‌రింత పెర‌గా ల్సిన అవస‌రం ఉంద‌ని ఎప్ప‌టి నుంచో తాము కోరుకుంటున్నామ‌ని కానీ అవేవీ లేకుండానే తమ జీవితాల‌ను నెట్టుకువ‌స్తున్నామని, ముఖ్యంగా కార్పొరేష‌న్ల‌లో విలీనం అయిన పంచాయ‌తీ కార్మికుల జీతాలు ఇవాళ్టికీ అర‌కొర‌గానే ఉన్నాయ‌ని,ప‌ది నుంచి 12 వేలు మా త్ర‌మే కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న చెల్లిస్తున్నార‌ని ఆవేద‌న చెందుతున్నారు.క‌నుక ప‌క్క రాష్ట్రం స్ఫూర్తితో త‌మ వేత‌నాలు కూడా పెంచాల‌ని వీరంతా ప‌ట్టుబ‌డుతున్నారు.కొత్త ఏడాదిలో త‌మ‌ను జ‌గ‌న్ క‌రుణిస్తే ఎంతో ఆనందిస్తామ‌ని కూడా అంటున్నారు వీరు.

పారిశుద్ధ్య కార్మికుల వేత‌నాల పెంపు విష‌య‌మై మంత్రి కేటీఆర్ తీసుకున్న నిర్ణ‌యం మంచి ఫ‌లితాలే ఇచ్చేలా ఉంది.కొత్త ఏడాది కానుక‌గా వారి జీతాలు 30శాతం పెంచ‌డంతో సంబంధిత వ‌ర్గాలు ఆనందం వ్య‌క్తం చేస్తున్నాయి.దీంతో  పాటు ఆశ వ‌ర్క‌ర్ల జీతం కూడా అదే విధంగా 30 శాతం పెరుగుద‌ల‌తోనే  జీఓ రిలీజ్ చేశారు.ఈ రెండూ సంబంధిత వ‌ర్గాల‌లో ఆనందాలు నింపుతున్నాయి.
2015తో పోలిస్తే ఇప్ప‌టి జీతం పెంపు కాస్త మేలు చేసే విధంగానే ఉంది అని పారిశుద్ధ్య కార్మికులు చెబుతున్నారు.2015 క‌న్నా ముందు పారిశుద్ధ్య‌ కార్మికుల జీతం 8,500 అన్నీక‌లుపుకుని (పీఎఫ్,ఈఎస్ఐ లాంటి ఇత‌ర సౌక‌ర్యాలు క‌లుపుకుని) 9,882 రూపాయ‌లు..గా ఉండేది.2015 నుంచి పారిశుద్ధ్య కార్మికుల జీతం 12,500.అన్నీ క‌లుపుకుని 14,532.అంటే వీరి జీతంలో పెరుగుద‌ల 4,650 అని గ‌ణాంకాలు చెబుతున్నాయి.2017 నుంచి వీరి జీతం 14,000 అన్నీ క‌లుపుకుని 16,275 అంటే వీరి జీతంలో పెరుగుద‌ల 1743. తాజా నిర్ణ‌యం ప్ర‌కారం 17,000...అన్నీ కలుపుకుని 19503 అంటే జీతంలో పెరుగుద‌ల 3,228 అని ప్ర‌భుత్వ గ‌ణాంకాలు చెబుతున్నాయి. దీంతో సంబంధిత వ‌ర్గాలు త‌మ క‌ష్టాలు గుర్తించి కొత్త ఏడాది కానుక‌గా జీతాలు పెంచిన కేటీఆర్ కు, సీఎంకేసీఆర్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.ఇదంతా జీహెచ్ఎంసీ ప‌రిధిలో ప‌నిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల జీతాల స‌ర‌ళి.అర్బ‌న్ లోక‌ల్ బాడీ (యూఎల్బీ) సంబంధించి పారిశుద్ధ్య కార్మికుల జీతాల పెరుగుద‌ల 2017 నుంచి 4301గా ఉంది. అప్ప‌ట్లో వీరి జీతం 12000 ఉండేది.కానీ ఇప్పుడు 15600..పెంపు 4107 రూపాయ‌లు. (2015కు ముందు వీరి జీతం 8500గా ఉండేది)








మరింత సమాచారం తెలుసుకోండి:

trs