బెనిఫిట్ షోలు వేసుకునే ఛాన్స్ ఇస్తారా?  
కోర్టులు చెప్పినా కూడా విన‌ని జ‌గ‌న్ అనే ఓ మొండిఘ‌టం ఆర్జీవీ చెబితే ఎలా వింటారు? ఎందుక‌ని వినాలి? అంత అవ‌స‌రం 
ఏమొచ్చింద‌ని? త‌న మాట నెగ్గితే చాలు అని అనుకునే మ‌నిషి ద‌గ్గ‌ర మాట‌ల మాయాజాలం చేస్తే ఫ‌లితం అనుకూలంగా వ‌స్తుందా అన్నది ఓ పాయింట్. ఇదే ఫోక‌స్ పాయింట్ కూడా! ఆర్జీవీకి వైసీపీకి ఉన్న బంధాలు బ‌ల‌ప‌డేందుకే పేర్నినాని చ‌ర్చ‌ల‌కు పిలిచారా? అయితే నాగార్జున‌ను వ్యూహాత్మ‌కంగానే ఇండ‌స్ట్రీ పెద్ద అన్న బాధ్య‌త‌ను నుంచి త‌ప్పించి రేప‌టి బంగార్రాజు సినిమాకు బెనిఫిట్ షోలు వేసుకునే ఛాన్స్ ఇస్తారా?  

ఏపీ మంత్రి పేర్నినాని గ‌డిచిన రెండు మూడు రోజులుగా ట్రోల్ అవుతూనే ఉన్నారు. ఆర్జీవీ ట్వీట్ల కార‌ణంగా జ‌న‌సేన పండుగ

చేసుకుంటుంది.పేర్ని నానిని టార్గెట్ చేస్తోంది.టికెట్ ధ‌ర‌ల త‌గ్గింపున‌కు సంబంధించి రామూతో మాట్లాడేందుకు పేర్నినాని అపాయింట్మెంట్ ఇవ్వ‌డంతో వివాదం మ‌రో మ‌లుపు తిరిగింది.ఇప్ప‌టికే రివైజ్డ్ క‌మిటీ టికెట్ ధ‌ర‌ల‌పై ప‌నిచేస్తోంది.ఈ స‌మ‌యంలో ఈ నెల 10 త‌న‌ను క‌ల‌వాల‌ని పేర్నినాని త‌మ‌కు అపాయింట్మెంట్ ఇచ్చార‌ని ఆర్జీవీ త‌ర‌ఫు వ్య‌క్తుల మాట.దీంతో వివాదం మ‌రో మ‌లుపు తిరిగింది.ఆర్జీవీ దౌత్యం ఫలిస్తే అంత‌కుమించిన ఆనందం ఇంకొక‌టి ఉండ‌ద‌ని ఏపీ ప్ర‌భుత్వం దిగివ‌స్తే అంత‌కుమించిన సంక్రాంతి కానుక మ‌రొక‌టి ఉండ‌ద‌ని అంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు.ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే థియేట‌ర్లు మూసి వేసి మ‌రో ప‌ని వెతుక్కుంటున్న ఎగ్జిబిటర్ల‌కు ప్ర‌భుత్వ పెద్ద అయిన పేర్నినాని తో ఆర్జీవీ చెప్పించే మాట‌లు ఎలా ఉంటాయో అన్న ఆస‌క్తి కూడా నెల‌కొని ఉంది.ఇదే స‌మ‌యంలో న్యాయ‌ప‌ర‌మైన డిమాండ్ల‌నీ ఆర్జీవీ మాట్లాడి ఒప్పిస్తే, ఆయ‌నే ఇండ‌స్ట్రీకో మెగా స్టార్ కావొచ్చు.కానీ జ‌గ‌న్ వింటారా లేదా 
వినిపించుకుంటారా? త‌న మ‌నుషులదే ఇండ‌స్ట్రీ అన్న సంకేతాలు ఇచ్చేందుకు జ‌గ‌న్ కావాల‌ని ఆర్జీవీని రంగంలోకి దింపారా? ఇదంతా వైసీపీ ఆడుతున్న డ్రామా క‌నుక నెగ్గేదెవ‌రు?



మరింత సమాచారం తెలుసుకోండి: