ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రానున్న ఎన్నిక‌ల్లో ఎలాగైన స‌త్తా చాటాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. వైసీపీ ని ఓడించి అధికారం చేజిక్కించుకోవడానికి ఇత‌ర పార్టీల‌ను క‌లుపుకుని వెళ్లాల‌ని చూస్తున్నారు. దీంతో రాబోయే ఎన్నిక‌ల్లో పొత్తుల ఏర్పాటుకు ఇప్ప‌టి నుంచే సంకేతాలు పంపిస్తున్నారు. కార్య‌క‌ర్త‌ల నుంచి జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకోవాల‌న్న ప్ర‌తిపాద‌నపై చంద్ర‌బాబు స్పందించిన తీరు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ స‌మ‌యంలో బాబు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో వైఎస్ జ‌గ‌న్ విధ్వంస‌క‌ర పాల‌న చేస్తున్నార‌ని, రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశ‌నం చేశారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్య‌క్తం చేశారు. వాస్త‌వానికి బాబుకు కుప్పంలో ప‌రిస్థితి బాగాలేద‌నే చెప్పాలి.


 దీంతో కుప్పంలో ప‌రిస్థితుల‌ను మార్చేందుకు బాబు వ‌రుస‌గా ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు.  సాధార‌ణంగా చంద్ర‌బాబు కుప్పంలో అడుగు పెట్ట‌కుండానే ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తూ.. గెలుస్తూ వ‌చ్చారు. స్థానికంగా ఉన్న అభివృద్ధి ప‌నుల‌ను స్థానిక టీడీపీ నేత‌ల‌తో పూర్తి చేయిస్తుంటారు.  గ‌తంలో బాబు సీఎం గా ఉన్నప్పుడు కూడా అలాగే ప‌నులు చేయించుకుంటూ వ‌చ్చారు. అలానే, గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేయ‌కుండానే ఒంటిచేత్తో విజ‌యం సాధించారు. అలా గెలుస్తు వ‌స్తున్న టీడీపీకి వైసీపీ ఝ‌ల‌క్ ఇచ్చింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  కుప్పంపై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టిమ‌రి బాబు దెబ్బేశారు. టీడీపీ శ్రేణుల‌ను త‌మ‌వైపు తిప్పుకుని పంచాయ‌తి, ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో వైసీపీ జెండా ఎగుర‌వేశారు.


 ఈ దెబ్బ‌తో బాబు కుప్పంలో వ‌రుస ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. తాజాగా మ‌రోసారి బాబు కుప్పంకు వెళ్లారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కుప్పం స్థానానికి ఎలాంటి చిల్లు ప‌డ‌కుండా చూసుకునే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. అయితే, ఈ మధ్య జూ.ఎన్‌టీఆర్ అభిమానులు టీడీపీకి వ్య‌తిరేకంగా నడుస్తున్న ప‌రిణామాలు క‌నిపిస్తున్నాయి. కుప్పంలో కూడా ఆయ‌న ఫ్యాన్స్ స‌పరేట్‌గా రాజ‌కీయాలు చేయ‌డం మొద‌లుపెట్టారు. ఇక వారిని త‌మవైపు తిప్పుకునేందుకు చంద్ర‌బాబు వ్యూహాలు రచిస్తున్న‌ట్టు స‌మాచారం. ఇందులో భాగంగా తార‌క్ ఫ్యాన్స్‌ను బుజ్జగించేందుకు ఎన్‌టీఆర్‌ను రంగంలోకి దించే అవ‌కాశాలు ఉన్న‌ట్టు ప్ర‌చారం కూడా సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: