తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ మధ్య మళ్లీ పొత్తులు పొడుస్తున్నాయా.... చిరకాల మిత్రులు మళ్లీ ఒకటవుతున్నారా... ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తుంది. దాదాపు 30 ఏళ్లు కలిసి కాపురం చేసిన టీడీపీ, బీజేపీల మధ్య... అనూహ్యంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం... రెండు పార్టీల మధ్య చిచ్చుకు కారణమైంది. వైసీపీ ఆడిన మైండ్ గేమ్‌లో చిక్కుకున్న చంద్రబాబు... తన చిరకాల మిత్రుడితో పోరాటం చేశారు. తెగదెంపులు చేసుకున్నారు. చివరికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో భాగస్వామ్యం కూడా వదులుకున్నారు. కేంద్రంపై పోరాటం చేశారు. ప్రత్యేక హోదా కోసం ఇటు రాష్ట్రంలో, అటు ఢిల్లీలో కూడా దీక్షలు చేశారు. పార్లమెంట్‌లో నిలదీశారు. చివరికి మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టారు. మోదీ సర్కార్‌పై లోక్ సభలో ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు టీడీపీ ఎంపీలు. చివరికి 1998 నుంచి ఉన్న బంధం 2018లో తెగిపోయింది. చివరికి 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎవరికి వారే ఒంటరిగా పోటీ చేశారు.

అయితే ఎన్నికల తర్వాత టీడీపీ ఒంటరిగా మిగిలిపోగా... బీజేపీ మాత్రం జనసేనతో పొత్తు కుదుర్చుకుంది. 2024 వరకు తమ పొత్తు కొనసాగుతుందని కూడా బీజేపీ నేతలు స్పష్టం చేశారు. అన్నట్లుగానే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో, బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కలిసే పోటీ చేశారు. కానీ ప్రస్తుతం ఆ రెండు పార్టీల మధ్య వాతావరణం కాస్త బెడిసికొట్టినట్లుగా ఉంది. ఇదే సమయంలో బీజేపీ, జనసేన పార్టీలకు దగ్గరయ్యేందుకు టీడీపీ ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఈ మూడు పార్టీలు విడివిడిగా.. అధికార వైసీపీని టార్గెట్ చేస్తున్నాయి. ఈ మూడు పార్టీలు కలుస్తాయని ఇప్పటికే రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైనట్లు తెలుస్తోంది. దమ్ముంటే తనపై అనర్హత వేటు వేయించాలని కూడా డిమాండ్ చేశారు. ఈ విషయం మా వల్ల కాదని బహిరంగంగా చెబితే... తానే స్వయంగా రాజీనామా చేస్తానని ప్రకటించారు. తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ చేసి వైసీపీని ఓడిస్తామన్నారు. ఇప్పుడు రఘురామ బీజేపీ తరఫున పోటీ చేస్తే... టీడీపీ అభ్యర్థి బరిలో ఉంటారా... లేదా అనే విషయం తేలాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: