కరోనా కలకలం మళ్ళీ పరుగులు తీస్తోంది. ఇప్పటికే ఫారన్ కంట్రీస్ లో కరోనా ఉగ్రరూపం దాల్చి విరుచుకు పడుతోంది. ఇటు మన దేశంలోనూ కరోనా వేట మళ్ళీ మొదలయ్యింది. నిత్యం లక్షకు మించి కొత్త కేసులు నమోదు అవుతుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.  మరణాల సంఖ్య కూడా పెరగడం మరో టెన్షన్ గా మారింది. అయితే కరోనా కట్టడి కోసం ప్రభుత్వం కూడా అప్రమత్తమై శరవేగంగా చర్యలు చేపడుతోంది. ఆలస్యం, నిర్లక్ష్యం ప్రమాదాన్ని మరింత పెంచుతాయని ప్రజల్ని హెచ్చరిస్తోంది. తాజాగా ప్రయాణికులకు కీలక ఆదేశాలను జారీ చేసింది కేంద్రం.

ఈ నిర్ణయం విదేశీ ప్రయాణికులపై ప్రభావం చూపనుంది. కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ ఉన్నప్పటికీ...వారి శరీరంలో కొత్తగా వైరస్ ఎంటర్ అయి ఉండవచ్చని కాబట్టి దేశంలోకి వచ్చిన వారు విమానాశ్రయంలో కరోనా నెగెటివ్ రిపోర్ట్ ఉన్నప్పటికీ, అంతర్జాతీయ ప్రయాణికులందరూ ఇండియాకు రాగానే 7 రోజుల పాటు తప్పనిసరి హోమ్ క్వారంటైన్‌లో ఉండి జాగ్రత్త వహించాలని ఆదేశించింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ఈ మేరకు శుక్రవారం ఇందుకు సంబందించిన నోటిఫికేషన్‌ ను ఇచ్చింది. దీని ప్రకారం అంతర్జాతీయ ప్రయాణికులు దేశంలోకి వచ్చి 7 రోజుల క్వారంటైన్ తరువాత 8వ రోజు RT- PCR పరీక్షను చేయించుకోవాల్సి ఉంటుంది.

ఆ రిపోర్ట్ ను బట్టి వారిని అనుమతించడం జరుగుతుంది. విదేశీయానం చేసే వారికి ఇది కాస్త ఇబ్బందిగా అనిపించినా దేశాన్ని ప్రమాదం నుండి కాస్త అయినా రక్షించడం కోసం తప్పనిసరి అని వారు తెలియచేశారు. గత 24 గంటల్లో దేశంలో 1,41,000 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దాదాపు 300 మంది రోగులు ప్రాణాంతకమైన ఇన్‌ఫెక్షన్‌తో మరణించడం బాధాకరం. గతంలో కూడా ఇదే విధంగా విదేశీ ప్రయాణాలను అనుకున్న సమయం లోపు నియంత్రించకపోవడం మూలంగానే కేసులు లక్షల్లో వచ్చాయి. ఇప్పుడు అదే పొరపాటు చేస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: