ప్రశాంత్ కిషోర్...  భారత రాజకీయ వర్గాల్లో ఈ పేరుకు  పరిచయం అవసరం లేదు. ఉత్తర ప్రదేశ్ తో సహా ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం సమాయత్తం అవుతున్న వేళ,   ఈ ఎన్నికల  వ్యూహకర్త తన దైన సూచనలుచేశారు. అవి ఏంటో ఒక సారి చూద్దాం.
పంజాబ్, మణిపూర్, గోవా,  ఉత్తర ఖండ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో ఎన్నికలు జరగనన్న విషయం అందరికీ విదితమే. కోవిడ్-19 తాజా వేరియంట్ ఓమిక్రాన్ భారత్ లో తన ప్రతాపాన్ని చూపుతున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం తాజా పరిస్థితిపై ఎన్నికల సంఘం వివిధ రాజకీయ పార్టీలతో సమవేశం నిర్వహించింది. సమావేశంలో అన్ని రాజకీయ పక్షాలు ఎన్నికల నిర్వహణకే మొగ్గు చూపినట్లు వార్తలు వస్తున్నాయి. సమావేశం ముగిసిన తరవాత భారత్ లో పరిణామాలు శరవేగంగా మారాయి. దేశ విదేశాల లోని నిపుణులు హెచ్చరికలకు తగ్గట్టుగానే భారత్ లో కేసులు రోజుకు లక్షన్నర కేసులు దాటుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ పై నీలి నీడలు కమ్మకున్నాయా అన్న అనుమానాలు రెకెత్తుతున్నాయి. ఈ క్రమంలో  భారత్ లో  ఎలక్షన్ మేనేజ్ మెంట్ వ్యూహకర్తగా పేరుతెచ్చుకున్న ప్రశాంత్ కిశోర్ ఎన్నికల నిర్వహణపై కొన్ని సూచనలు చేశారు. అవి ఏంటో ఒకసారి పరికిద్దాం.
కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని విషయాలలో మరింత కఠినంగా వ్యవహరించా ల్సి ఉంటుంది.ఎన్నికలు నిర్వహించే రాష్ట్రాలలోని ఓటర్లు  తప్పనిసరిగా రెండు డోసుల టీకా వేసుకుని ఉండాలి. కనీసం ఎనభై శాతం మంది అయినా  రెండు డోసుల టీకా వేసుకుని ఉండాలి. దేశీయంగాను, అంతర్జాతీయంగాను నిపుణులు సూచిస్తున్నవిషయం ఒక్కటేయ కరోనాకు అడ్డుకట్ట వేయాలంటే  ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలి. ఈ నియమావళిని అందరూ  ఖచ్చితంగా పాటించాలి. టీకాలు వేసే కార్యక్రమం ఎంత వరకూ వచ్చిందనే విషయం ఎన్నికల సంఘం ఆయా రాష్ట్రాలతో చర్చించాలి. అవసరమైతే కేంద్ర ఆరోగ్య శాఖ తో మాట్లాడి యూద్ద ప్రాతిపదికన  కనీసం ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో అయినా టీకాలు వేసే కార్యక్రమం వేగవంతం చేయాలి.  ఎన్నికలు నిర్వహించాల్సిన రాష్ట్రాలలో నూటికి నూరు శాతం టీకాలు పూర్తిచేయాలి. అప్పుడు మాత్రమే ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ముందుకు రావాలి అని ప్రశాంత్ కిషోర్ పేర్కోన్నారు.
ఈ ఎన్నికల వ్యూహకర్త మాటలను ఆయనతో ఒప్పందం కుదుర్చుకున్న రాజకీయ పార్టీలు ఆలకిస్తాయి కానీ, ఎన్నికల సంఘం వింటుందా ? చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: