అది బ్ర‌హ్మ‌న్న కోట
ప‌ల్నాటి సీమ
అలాంటి నేల‌పై
అలనాటి పౌరుషం
ఓ రైత‌న్న పౌరుషం
ఏ విధంగా ఉందో
చెప్పే సాహ‌స క‌థ ఇది  
సాహస గాథ ఇది


పాల‌కులు మేల్కోక పోతే రేప‌టి వేళ  త‌గిన మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దు అని హెచ్చ‌రించే క‌థ ఇది...ఎమ్మెల్యే బ్ర‌హ్మ‌న్నా! ఇది నీ క‌థ.. వింటున్నావా..నీ ఊరి భాగోతం..వింటున్నావా మా భూమి భాగోతం..వింటున్నావా నీ అరాచ‌క ప‌ర్వానికి అక్ష‌ర రూపం..
తిర‌గ‌బడ్డ గానంలో రేప‌టి వేళ ఉద‌యాలు గొప్ప సంస్క‌రణ‌కు శ్రీ‌కారం దిద్దుతాయి..ప్ర‌పంచాన్ని త‌ట్టిలేపుతాయి..మ‌ట్టి నేలల‌పై కొత్త మార్పు గీత రాస్తాయి.నువ్వు సిద్ధంగా ఉండు అన్నా!

 

రైతే రాజు అని సోది చెప్ప‌కండి..కోపం త‌న్నుకువ‌స్తుంది..ఓ రైతుకు అందాల్సిన భ‌రోసా ఎమ్మెల్యే అందించాల‌నుకున్న చెప్పు
దెబ్బే అయితే ఈ ప్ర‌భుత్వం ఇంత‌కుమించి మ‌రింత అవ‌మానాలు ముందున్న కాలంలో పొంద‌డం ఖాయం. ఒళ్లంతా గాయాల‌తో  
స‌త‌మ‌త‌మ‌య్యే రైతుకు మీరు ఇచ్చే బ‌హుమానాలూ,భ‌రోసాలూ ఇవే అయితే సిద్ధంగా ఉండండి..మిమ్మ‌ల్ని మ‌ట్టిలో క‌లిపే రోజు త‌ప్ప‌క వ‌స్తుంది..ఆ మ‌ట్టిని కూడా మోయాల్సింది ఆ రైతే క‌దరా! బ్ర‌హ్మ‌న్నా! ఇది త‌ప్పు అని చెప్ప‌డం కాదు.. ఇప్ప‌టికైనా మించి పోయింది లేదు ఆ రైతు కాళ్లు ప‌ట్టుకుని క్ష‌మాప‌ణ అడుగు..లేక‌పోతే ఈ దేశం నిన్ను క్ష‌మించ‌దు..


భూమికి పచ్చాని రంగేసే రైతు..నేల‌కు వంద‌నం చెప్పి నింగికి తన హృద‌య నివేద‌న అందించే రైతు..దారంతా ముళ్లు,గాజు పెంకులు అన్నింటినీ దాటుకుంటే స‌స్య కేదారం ఒక‌టి ప‌ల‌క‌రిస్తుంది..మూడు పూట‌లా తిండి దొరికితే మ‌న‌కు ఆనందం..పండించిన పంట‌కు ఆ పాటి గిట్టుబాటు దొరికితే రైతుకు మ‌హ‌దానందం.రైతు క‌ళ్ల‌ల్లో ఆనందం చూడాల్సిన వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్ర‌హ్మ నాయుడి వికృతం ఇది..వినండిక..

రైతు కోసం మేం అని చెప్పే ప్ర‌భుత్వాల ద‌గ్గ‌ర సాగిల‌ప‌డ్డం చేత‌గాని రైతు అత‌డు..తిర‌గ‌బ‌డ్డ రైతు అత‌డు..మామూలు మ‌నిషి కాదు మ‌హా రుషి వాడు.అటువంటి రుషికి కోపం వ‌స్తే ఏం చేస్తాడో.. ఏం చేయాలో అదే చేస్తాడు.. ఓ రైతును అదీ సొంత పార్టీ మ‌నిషిని అస్స‌లు వెనుకా ముందూ చూడ‌కుండా చెప్పు తీసుకుని కొట్టేందుకు వెళ్లిన ఆ ఎమ్మెల్యేను ఏమ‌నాలి..హెరాల్డ్ అందిస్తున్న వివ‌ర‌ణాత్మ‌క క‌థ‌నం.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న రైతు భ‌రోసా కేంద్రాల‌కు విప‌రీతం అయిన ఆద‌ర‌ణ ఉంద‌ని చెబుతోంది. కానీ ధాన్యం కొనుగోలు మాత్రం ఎక్కడా స‌రిగా జ‌ర‌గ‌డం లేదు. ప్ర‌భుత్వం చెప్పిన విధంగా అధికారులు ధాన్యం కొనుగోలుపై ఆస‌క్తి చూప‌డం లేదు. నిబంధ‌న‌ల అమ‌లు కూడా స‌రిగా లేదు.దీంతో ప్ర‌భుత్వం మ‌ద్ద‌తు ధ‌ర కింద (క్వింటా ధాన్యం ధ‌ర‌) 1450 రూపాయలు ప్ర‌క‌టించినా కూడా ఎవ్వ‌రూ కొనుగోలు చేయ‌డం లేదు అని వాపోయాడు..ఇదంతా శావ‌ల్యాపురం మండ‌లం, వేల్పూరు గ్రామంలో నిన్న‌మొన్న‌టి వేళ చోటుచేసుకున్న ఘ‌ట‌న‌కు తార్కాణం..ఈ గ్రామం గుంటూరు జిల్లా,వినుకొండ నియోజ‌క‌వ‌ర్గంలో ఉంది. స్థానిక ఎంపీ లావు కృష్ణ దేవ‌రాయులు ఓ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు ఇక్క‌డికి వ‌చ్చిన సంద‌ర్భంగా క్షేత్ర స్థాయిలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఉన్న స‌మ‌స్య‌లు వివ‌రించేందుకు వైసీపీకి చెందిన రైతు గ‌డిపూడి న‌రేంద్ర ఎంపీని ఆశ్ర‌యించారు.గ్రామానికి వ‌చ్చిన సంద‌ర్భంగా రైతుల క‌ష్టాల‌న్నింటినీ వివ‌రించి స‌మ‌స్య ప‌రిష్క‌రించాల‌ని ప‌ట్టుబట్టారు.

ఇదే స‌మ‌యంలో వినుకొండ ఎమ్మెల్యే బ్ర‌హ్మ నాయుడు కూడా ఆయ‌న‌తో పాటే అదే గ్రామానికి  వ‌చ్చారు. రైతు స‌మ‌స్య‌లు విని చ‌లించి పోయిన ఎంపీ మాత్రం వెంట‌నే స్పందించి జేసీతో మాట్లాడారు.మ‌రో రెండు రోజుల్లో స‌మ‌స్య  ప‌రిష్కారం అవుతుంద‌ని అన్నారు.ధాన్యం కొనుగోలు చేస్తారు స‌రే డ‌బ్బులు ఎవ‌రిస్తారు అంటూ మ‌ళ్లీ న‌రేంద్ర త‌న‌దైన వాద‌న‌ను వినిపించారు.ధాన్యం కొనుగోలు త‌రువాత డ‌బ్బుల విష‌య‌మై భ‌రోసా ఇచ్చేది ఎవ‌ర‌ని మళ్లీ గొంతు పెంచి ప్ర‌శ్నించ‌డంతో అక్క‌డే ఉన్న ఎమ్మెల్యే ఆగ్ర‌హంతో ఊగిపోయి చెప్పు అందుకుని రైతుపై కొట్ట‌డానికి వ‌చ్చారు..నానా బూతులూ తిట్టారు.దీంతో రైతు కూడా తిర‌గ‌బ‌డి,తన‌దైన శైలిలో స‌మాధానం ఇచ్చాడు.నేను కూడా కొట్ట‌గ‌ల‌ను అని ఎమ్మెల్యేకు ఎదురు నిలిచాడు.ఇక చేసేది లేక ప‌ట్ట‌రాని ఆగ్ర‌హంతో ఊగిపోయి రైతును అరెస్టు చేయించి ఒక రోజంతా లాకప్ లో ఉంచి చిత్ర‌హింస‌లకు గురిచేశార‌ని స్థానికుల మాట.

 
గురువారం సాయంత్రం న‌రేంద్ర‌ను స్టేష‌నుకు తీసుకుపోయిన పోలీసులు అధికార పార్టీ ఎమ్మెల్యే మాట మేర‌కు శుక్ర‌వారం రాత్రి వ‌ర‌కూ బాధిత రైతును విడిచి పెట్ట‌లేదు స‌రిక‌దా! స్టేష‌న్లో చిత్ర‌హింస‌ల‌కు గురిచేశార‌ని స్థానికులు, రైతులు వాపోతున్నారు. ఇదీ ఈ దేశాన రైతుకు ద‌క్కిన గౌర‌వం..ఇదేంట‌ని ప్ర‌శ్నించిన రైతుకు న్యాయం కావాల‌ని ప‌ట్టుబ‌ట్టిన రైతుకు ఈ దేశంలో ద‌క్కుతున్న గొప్ప‌నైన గౌర‌వం.. శ‌బ్బాష్ బ్ర‌హ్మ‌న్నా!నీకు తిరుగులేదు..ఇక నీవు రెచ్చిపో..నీ గూండాల‌ను కూడా న‌రేంద్ర పొలానికి పంపి ఈ వార్త వెలుగు చూసినందుకు ఏం చేయాల‌నుకుంటున్నావో అవ‌న్నీ వెంట‌వెంట‌నే చేసేయ్..ఏం కాదు..ఇది మీ రాజ్యం ఇది మీ పాల‌న అన‌గా దేవుడి పాల‌న..అరేయ్ ! ఇప్ప‌టికైనా త‌గ్గండ్రా!




మరింత సమాచారం తెలుసుకోండి:

ycp