ప్రస్తుతం ఆప్ఘనిస్థాన్లో తాలిబన్ పాలనలో అమలు లోకి వస్తున్న ఆంక్షలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మహిళల విషయంలో తాలిబన్లు పెడుతున్న నిబంధనలు పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నాయని చెప్పాలి. మహిళలు చదువుకో కూడదని ఉద్యోగాలు చేయకూడదని వ్యాపారం జోలికి అస్సలు రాకూడదని ఇంటిపట్టునే ఉండాలి అంటూ తాలిబన్లు ఆంక్షలు తీసుకువచ్చారు. అంతేకాకుండా దూర ప్రయాణాలకు పోయేటప్పుడు కూడా పురుషుడి తోడు తప్పనిసరిగా ఉండాలి అంటూ ఆంక్షలు పెట్టారు. అయితే ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ లకు ఎలాంటి ఆంక్షలు అయితే కొనసాగిస్తున్నారో అచ్చంగా ఇలాంటివే అటు సౌదీఅరేబియాలో కూడా కొనసాగుతున్నాయి.



 మహిళలను బానిసలుగా చూస్తూ సౌదీ అరేబియాలో అరాచక చట్టాల అమలులో ఉన్నాయి అని చెప్పాలి. కనీసం అక్కడికి వచ్చే టూరిస్టులకు కూడా స్వేచ్చ లేకుండా నిబంధనలు ఉంటాయి. అయితే ఇప్పుడు మాత్రం సౌదీ అరేబియా గత కొంత కాలం నుంచి తీసుకున్న నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. మొన్నటి వరకు ఆయిల్ బావుల ద్వారా లక్షల కోట్ల రూపాయలు సంపాదించిన సౌదీ రాజులు.. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎలక్ట్రిక్ వైపు అడుగులు వేస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఆదాయంపై దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో గత కొంత కాలం నుంచి చట్టాలలో ఎన్నో ఊహించని మార్పులు తీసుకువస్తూ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది సౌదీ అరేబియా ప్రభుత్వం..



 రాచరిక చట్టాలతో ఎన్నో దశాబ్దాల నుంచి ఇళ్లలోనే మగ్గిన మహిళాలోకానికి ప్రస్తుతం సౌదీ అరేబియాలో చట్టాలలో తీసుకు వస్తున్న మార్పులు విముక్తి కలిగిస్తున్నాయి అని చెప్పాలి. ఇప్పటికే మహిళలకు డ్రైవింగ్ ఆర్మీ లో కూడా అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. మగ తోడు లేకుండా ఒంటరిగా ప్రయాణాలు చేసేందుకు కూడా పర్మిషన్ ఇచ్చింది సౌదీ అరేబియా ప్రభుత్వం. ఇక ఇటీవలే మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. మహిళలు ట్రైన్స్ నడిపేందుకు కూడా అవకాశం ఇస్తున్నట్లు  తెలిపింది సౌదీ అరేబియా ప్రభుత్వం. అంతే కాకుండా మహిళలుటాక్సీలు కూడా నడుపుకొని జీవనం సాగించవచ్చు అంటూ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: