తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిస్థితి చూస్తే... ప్రస్తుతం జాలి వేస్తుంది. రాజకీయాల్లో 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు... ఇప్పుడు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిగించిన ఉచ్చులో చిక్కుకున్నారు. ఇంకా చెప్పాలంటే... ఓ మాజీ ముఖ్యమంత్రిని పూర్తిగా లాక్ చేసింది వైసీపీ. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం వైసీపీ ఆడుతున్న మైండ్ గేమ్‌లో పడ్డారు. గతంలో అధికారంలో ఉన్న సమయంలో కూడా వైసీపీ ట్రాప్‌లో చిక్కారు చంద్రబాబు. చివరికి 20 ఏళ్లుగా కొనసాగుతున్న స్నేహానికి కూడా గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ నేతలు ఆడిన గేమ్‌లో ఇరుక్కున్నారు చంద్రబాబు. అప్పటి వరకు అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో భాగస్వామిగా ఉన్న భారతీయ జనతా పార్టీతో విభేదించారు. కేంద్రంలోని మోదీ సర్కార్‌పై యుద్ధం ప్రకటించారు. ముందుగానే జరిగిన తెలంగాణ ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు కూడా.

ఇప్పుడు మరోసారి వైసీపీ ట్రాప్‌లో చంద్రబాబు ఇరుక్కున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు తనను గెలిపిస్తూ వస్తున్న కుప్పం నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడో ఆరు నెలలకు ఓసారి కనిపించే వారు. అది కూడా నియోజకవర్గ స్థాయి నేతలతో మాత్రమే సమీక్షలు నిర్వహించేవారు. ఇక ప్రజలకు ఏవైనా పనులు జరగాలంటే... అది కేవలం కింది స్థాయి నేతల వల్ల మాత్రమే సాధ్యం. అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తి విరుద్ధంగా మారిపోయింది. ఇప్పుడు ఏకంగా నెలలో రెండు, మూడు సార్లు కుప్పంలో పర్యటిస్తున్నారు చంద్రబాబు. దీంతో ఇప్పుడు సొంత పార్టీ నేతల్లో కూడా  ఒకటే మాట. చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికే పరిమితం అయ్యారా అని. ఎలాగైనా కుప్పం నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును ఓడిస్తామని ఇప్పటికే వైసీపీ నేతలు వార్నింగ్ ఇచ్చేశారు. దీంతో వైసీపీ వేస్తున్న రాజకీయ ఎత్తులు... అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దీంతో చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితానికే ప్రస్తుతం వైసీపీ సవాల్ విసురుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: