వాలంటైన్స్ డే ఇన్ గోవా... చాలా మంది ప్రేమికులు హాయిగా, ఆనందంగా గడపాలనుకునే హాలిడే స్పాట్ గోవా. అక్కడి బీచ్ లు, ప్రకృతి అందాలు, ఫుడ్ కోర్టులు, అమ్యుజిమెంట్ సెంటర్లు అన్నీ కూడా ప్రేమికులను మరో లోకంలోకి తీసుకువెళుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సారి గోవాలో వాలంటైన్స్ డే సందడి కనిపించక పోవచ్చు. కారణం ఏంటో తెలుసా మీకు ?
భారత  ఎన్నికల సంఘం (ఈసీ) శనివారం ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ లో  గోవా కు కూడా ఎన్నికలు జరుగుతాయని ప్రకటించింది. అక్కడ  ఒకే దఫాలో  ఎన్నికలు జరగనున్నాయి. సదరు ఎన్నిక ఫిబ్రవరి 14న నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. నలభై స్థానాలున్న గోవా అసెంబ్లీకి ఒకే దఫాలో ఎన్నిక జరగ నుంది.  ఎన్నికల కమీషనర్ సుశీల్ చంద్ర ఈ విషయం ప్రకటించారు. ప్రస్తుతం గోవా అసెంబ్లీ  పదవీ కాలం మార్చి ఆఖరు నాటికి పూర్తవుతుంది. దీంతో ఎన్నికను ఫిబ్రవరి 14 న నిర్వహించనున్నారు. మార్చి 10 వతేదీ కౌంటింగ్ నిర్వహిస్తారు.
ప్రస్తుతం ఆ రాష్ట్రం భారతీయ జనతా పార్టీ ఏలుబడిలో  ఉంది. రానున్న ఎన్నికల్లో సత్తా చాటాలని పలు పార్టీలు పోటీపడుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ  అందరి కన్నా ముందుగా ఎన్నికలప్రకటన విడుదలైన కొద్ది సేపటికే తమ పార్టీ నుంచ పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. పశ్చిమ బంగాల్ లో  బిజేపికి ఎదురు నిలిచి గెలిచిన తృణముల్ కాంగ్రెస్ కూడా తమ బలాన్ని గోవాకు విస్తవించాలని ఉవ్విళ్లూరుతోంది. గతంలో గోవాను పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఎలాగు తమ పీఠాన్ని తిరిగి దక్కించుకోవాలని ఆరాటపడుతోంది. గోవా అసెంబ్లీలో ఉండేది కేవలం నలభై స్థానాలు. ఎన్నికలకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ జనవరి 21న విడుదల అవుతుంది. నామినేషన్ల స్వీకరణకు ఆఖరి తేది జనవరి 28, నామినేషన్ల పరిశీలన జనవరి 29న జరగ నుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువును జనవరి 31గా నిర్ణయించారు. ఎన్నిక ముందు చెప్పినట్లుగా వాలంటైన్స్ డే ఫిబ్రవరి 14న జరగ నుంది. ఎన్నికల ఫలితాలు మార్చి 10 న జరిగే ఎన్నికల కౌంటింగ్ లో తెలుస్తాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: