టీడీపీ-జనసేన పొత్తు ఉంటుందా? అసలు పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు ఇంటరెస్ట్‌గానే ఉన్నారు గానీ...పవన్ ఇంటరెస్ట్‌గా ఉన్నారా? అంటే అబ్బే తాజాగా బాబు మాట్లాడినా వన్ సైడ్ లవ్ మాటలు చూస్తుంటే...పవన్ పొత్తు పెట్టుకోవడానికి ఆసక్తిగా లేరని చెప్పొచ్చు. కానీ చంద్రబాబు మాత్రం పొత్తు పెట్టుకోవడానికి ఆసక్తిగానే ఉన్నారని అర్ధమవుతుంది. అలాగే పొత్తు కోసం బాగానే ట్రై చేసినట్లు కూడా తెలుస్తోంది.

అయితే అటు వైపు ఇంటరెస్ట్ లేకుండా..వన్ సైడ్ లవ్ చేయడం కరెక్ట్ కాదని బాబు సర్ది చెప్పుకుంటున్నారు. ఇక బాబు లవ్ స్టోరీపై రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి. అసలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అయితే బాబుపై విమర్శలు చేశారు. బాబు ఒక అవకాశవాది అని, ఆయనకు అవసరమైతే ఎంతమందినైనా లవ్ చేస్తారని, అవసరం లేకపోతే ఏం చేస్తారో చెప్పాల్సిన పని లేదని అన్నారు. అసలు ఆయన ఆఖరికి కాంగ్రెస్‌ని కూడా లవ్ చేశారని సెటైర్లు వేశారు. అందుకే ఆయనతో పొత్తు పెట్టుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరన్నట్లు చెప్పారు.

సరే బీజేపీతో పొత్తు అనేది టీడీపీకి అంత ముఖ్యం కాదు. ఎందుకంటే ఆ పార్టీకి పెద్దగా ఓటు బ్యాంక్ లేదు. కానీ జనసేనతో పొత్తు పెట్టుకోవడం టీడీపీకి బాగా ముఖ్యం. జనసేనకు కాస్త ఓట్లు ఉన్నాయి. పైగా జనసేన కలిస్తే ప్లస్ అవుతుంది. అందుకే బాబు పొత్తు కోసం పాకులాడుతున్నారు. మరి జనసేన నేతలు పొత్తు కోసం అంత పాకులాడుతున్నట్లు కనిపిస్తోంది. గతంలో పొత్తుతో కొంత అనుభవం అయింది..పైగా పవన్‌ని టీడీపీ శ్రేణులు ఏ రేంజ్‌లో తిట్టాయో కూడా తెలుసు.

అందుకే టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి జనసేన అంతగా ముందుకు రావడం లేదు. అయితే పొత్తు పెట్టుకోవడానికి ఒక కండిషన్ పెడుతున్నారు. పవన్ కల్యాణ్‌కు సీఎం సీటు ఇస్తే...టీడీపీకి సపోర్ట్ ఇస్తామని జనసేన నేతలు మాట్లాడుతున్నారు. మరి రాజకీయంగా బలంగా ఉన్న టీడీపీ, చంద్రబాబులు..జనసేనతో పొత్తు కోసం సీఎం సీటుని వదులుకోవడం జరిగే పని కాదని చెప్పొచ్చు. మరి చూడాలి ఈ పొత్తుల వ్యవహారం ఎంత వరకు వెళుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: