రాజకీయాల్లో పొత్తులు అనేవి ఒకోసారి లాభం చేకూరుస్తాయి...ఒకోసారి నష్టం కూడా చేకూరుస్తాయి. ఆ విషయం టీడీపీ అధినేత చంద్రబాబుకు బాగా తెలుసని చెప్పొచ్చు. ఎందుకంటే బాబు పొత్తు పెట్టుకుని పార్టీ అంటూ ఏది లేదు. ఆఖరికి కాంగ్రెస్‌తో కూడా పొత్తు పెట్టుకున్నారు. అయితే ఈ పొత్తుల వల్ల ఒకోసారి లాభం జరిగితే...మరొకసారి నష్టం జరిగింది. రాజకీయాల్లో ఇదంతా సహజమే...కానీ పొత్తు పెట్టుకుంటే లాభం జరుగుతుందనే స్ట్రాటజీ బాబుకు బాగా తెలుసు. ఒకోసారి ఫెయిల్ అయినా సరే...ఎక్కువసార్లు సక్సెస్ అయ్యారు. అందుకే ఎప్పుడు ఏ పార్టీతో ముందుకెళ్లాలనే విషయం బాబుకు బాగా తెలుసు.

అందుకే ఇప్పుడు జనసేన పార్టీ కోసం బాబు పాకులాడుతున్నారు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే టీడీపీకి లాభం ఉంటుందనే సంగతి బాబుకు బాగా తెలుసు. గత ఎన్నికల్లో పొత్తు లేకే ఎక్కువ నష్టపోయారు. అప్పుడు జనసేనతో పొత్తు పెట్టుకుని ఉంటే కనీసం గెలవకపోయినా...వైసీపీకి గట్టి పోటీ ఇచ్చే వారు. కానీ విడిగా పోటీ చేయడం వల్ల జనసేన ఓట్లు చీల్చేసి టీడీపీకి డ్యామేజ్ చేసి, వైసీపీకి లాభం జరిగేలా చేసింది.


కానీ ఈ సారి అలా జరగకూడదని బాబు భావిస్తున్నారు. అందుకే బాబు, పవన్‌ని దగ్గర చేసుకోవడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇటీవల బాబు మాట్లాడిన మాటలు బట్టి చూస్తే పొత్తు కోసం బాగా ట్రై చేసిన సరే..పవన్ మాత్రం పొత్తు పెట్టుకోవడానికి అంత ఆసక్తి కనబర్చినట్లు లేరని తెలిసింది. అంటే పొత్తు అంశం సక్సెస్ అయ్యేలా కనిపించడం లేదు.

ఒకవేళ మళ్ళీ పొత్తు లేకుండా బరిలో దిగితే మాత్రం టీడీపీ భారీగానే నష్టపోవచ్చు. ముఖ్యంగా కృష్ణా, విశాఖపట్నం ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీకి నష్టం జరుగుతుంది. ఇక విశాఖపట్నం పార్లమెంట్‌లో బరిలో దిగే బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్‌పై కూడా ఎఫెక్ట్ ఉంటుంది. గత ఎన్నికల్లో భరత్..వైసీపీపై 4 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. కానీ అప్పుడు జనసేనకు రెండున్నర లక్షలు పైనే ఓట్లు పడ్డాయి. అంటే పవన్ కలిస్తే బాలయ్య చిన్నల్లుడుకు కూడా ప్లస్సే..లేదంటే అస్సామే.  



మరింత సమాచారం తెలుసుకోండి: