తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇలాకా లోకి కమ్యూనిస్టులు చొరపడ్డారు. అదే నండీ వచ్చారు.  అవును ఇది నిజం. ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలు... వివరంగా చెప్పాలంటే సి.పి.ఐ, సిపిఎం నేతలు ఒకే రోజు తెలంగాణ ముఖ్యమంత్రి తో సమావేశం అయ్యారు. ఎందుకో తెలుసా ?
తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ లో  సిపిఎం జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు హాజరయ్యేందుకు కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్, మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి  తదితర ముఖ్యనేతలు హైదరాబాద్ కు విచ్చేశారు. వీరంతా  వీరంతా హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో కెసిఆర్ తో సమావేశం అయ్యారు.

అదే విధంగా ఏఐఎస్ ఎఫ్ జాతీయ మహాసభల్లో పాల్గోనేందుకు సిపిఐ జాతీయ నేత డి. రాజా తో పాటు పలువురు సిపిఐ జాతీయ నేతలు హైదరాబాద్ కు వచ్చారు. వీరు కూడా సిపిఐ నేత చాడ వెంకట రెడ్డితో కలసి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో సమావేశం అయ్యారు. ఒకే రోజు ఉభయ కమ్యూనిస్టు పార్టీల జాతీయ నేతలు కెసిఆర్ తో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సమావేశానికి ఎలాంటి ప్రధాన్యత లేదని, కేవలం మర్యాదపూర్వకంగా జరిగిందని వివిధ పార్టీల వారు చెప్పుకుంటున్నారు.కానీ సమావేశంలో ఉత్తర భారతంలో రానున్న ఎన్నికల పై చర్చ జరిగినట్లు సమాచారం. అదే విధంగా భారతీయ జనతా పార్టీ అవలంబిస్తున్నవిధానాలు, ప్రభుత్వ రంగ సంస్థల విక్రయం తదితర అంశాలను వీరు చర్చించినట్లు కూడా మీడియా జనానికి ప్రగతి భవన్ వర్గాలు సమాచారం ఇచ్చాయి. టి.ఆర్ ఎస్ అధినేత కెసిఆర్ తాను ఆరంభించ తలపెట్టిన ఫెడరల్ ఫ్రంట్ గురించి కమ్యూనిస్టు నేతలకు వివరించినట్లు సమాచారం. కాంగ్రెసేతర, బిజేపి యేతర పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయనున్నట్లు గతంలో కెసి ఆర్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణ ఉధ్యమ కాలం నుంచి కెసిఆర్ కు కమ్యూనిస్టులతో మంచి సాన్నిహిత్యం ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధనలో కమ్యూనిస్టులు పోషించిన పాత్ర గణనీయమైనదని ఆయన చాలా సార్లు బహిరంగంగానే మెచ్చుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: