పీఆర్సీ ప్రకటనతో ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలామంది సైలెంట్ అయ్యారు. అసంతృప్తి ఉన్నా కూడా బయటపడటంలేదు. అదే సమయంలో సచివాలయ ఉద్యోగుల్లో మాత్రం ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. రెండేళ్లు పూర్తయినా తమకు ప్రొబేషన్ డిక్లేర్ చేయలేదని, వేతనాలు పెంచలనేదనేది వారి ప్రధాన అభియోగం. అందుకే కొత్త తరహాలో ఉద్యమం చేస్తున్నారు. అధికారిక వాట్సప్ గ్రూప్స్ నుంచి లెఫ్ట్ అవుతూ ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నారు.

సచివాలయ ఉద్యోగాల నియామకం సమయంలో కూడా ప్రభుత్వం క్లారిటీతో లేదు. గతంలో ఎప్పుడూ ఇలా 15 వేల రూపాయల ఫిక్స్ డ్ శాలరీతో ఉద్యోగుల్ని నియమించుకున్న ఉదాహరణలు కూడా లేవు. ఒకవేళ అలాంటి నియామకాలు జరిగితే అవి ప్రభుత్వానికి సంబంధం ఉండేవి కావు. కానీ ఊరూ, వాడా సచివాలయాల్లో ప్రభుత్వం ఉద్యోగుల్ని నియమించింది వారిని రెండేళ్ల తర్వాత పర్మినెంట్ చేస్తామంది. కానీ గడువు దాటినా ఆ ఊసు లేదు.

విచిత్రం ఏంటంటే.. వీరు ఇప్పటి వరకూ ఎలాంటి ఉద్యమాలు చేయలేదు. కేవలం పీఆర్సీ పెంచడం వల్లే సచివాలయ ఉద్యోగుల్లో కూడా చురుకు మొదలైంది. రెగ్యులర్ ఉద్యోగులకు జీతాలు పెంచి, తమకు మాత్రం వాయిదా వేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ మరో చిన్న లాజిక్ ని ప్రభుత్వం మిస్ అయింది. గతంలో వాలంటీర్లు తమ జీతాన్ని 5వేల రూపాయలనుంచి కాస్త పెంచాలని అభ్యర్థించారు. అయితే అది సేవకు లభిస్తున్న ప్రతిఫలం మాత్రమే, జీతం కాదు అంటూ ప్రభుత్వం సర్దిచెప్పింది. సచివాలయ ఉద్యోగులకు 15వేలు, వాలంటీర్లకు 5 వేల జీతంతో ఒకేసారి నియామకాలు జరిగాయి. మరి సచివాలయ ఉద్యోగులకు జీతం పెంచి, వాలంటీర్లకు పెంచకపోతే వీరు ఊరుకుంటారా..? ఎంత సేవా దృక్పథంతో ఉన్నా.. తమతోపాటే విధుల్లో చేరిన సచివాలయ ఉద్యోగులకు జీతాలు పెంచి, తమను మాత్రం అనాథలుగా వదిలేస్తారా అని ప్రశ్నించరా. ఆ ఉద్యమం కూడా మొదలైతే మాత్రం ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇరుకున పడినట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి: