మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తున్న కారణంగా ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ టోపీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి తీవ్రం కావడంతో.. నిబంధనలు పాటించకోపోతే లాక్ డౌన్ అమలు చేయకతప్పదని హెచ్చరించారు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదని.. లాక్ డౌన్ వద్దనుకుంటే కరోనా నియమాలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ఇక మహారాష్ట్రలో గడిచిన 8రోజుల్లో 1.17లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

కొవిడ్ ఉధృతి అధికంగా ఉన్న మహారాష్ట్రలో జనవరి 10నుంచి నైట్ కర్ఫ్యూ అమలు కానుంది. రాత్రి 11గంటల నుంచి తెల్లవారుజామున 5గంటల వరకు ఇది అమల్లో ఉంటుంది. ఐదుగురు అంతకంటే ఎక్కువమంది గుమిగూడటాన్ని అధికారులు నిషేధించారు. ఇక స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లకు ఫిబ్రవరి 15 వరకు సెలవులు ప్రకటించారు. సెలూన్లు, స్పోర్ట్స్ కాంప్లెక్సులు, స్విమ్మింగ్ పూల్స్, జిమ్ లు, స్పాలు తదుపరి ఆదేశాలిచ్చేదాకా మూసివేయాలన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. గత 24గంటల్లో 73వేల 156కరోనా టెస్టులు చేయగా 2వేల 606పాజిటివ్ కేసులొచ్చాయి. ఇద్దరు మరణించారు. ఒక్క జీహెచ్ ఎంసీ పరిధిలోనే 1,583 కేసులొచ్చాయి. శుక్రవారంతో పోలిస్తే శనివారం రాష్ట్రవ్యాప్తంగా 311కేసులు ఎక్కువగా వచ్చాయి. రోజువారీ కేసులు చూస్తే జనవరి 2వ తేదీన 274, జనవరి 3వ తేదీన 482, జనవరి 4వ తేదీన 1052, జనవరి 5వ తేదీన 1520, జనవరి 6వ తేదీన 1913, జనవరి 7వ తేదీన 2295, జనవరి 8వ తేదీన 2606గా ఉన్నాయి.

ఇదిలా ఉంటే కోవిడ్ థర్డ్ వేవ్ తీవ్రంగా కలవరపెడుతోంది. ఈ కారణంగా.. చికిత్సకు అవసరమైన మందులు తగినంత అందుబాటులో ఉంచడంపై రాష్ట్ర ఆరోగ్యశాఖ దృష్టిపెట్టింది. ప్రభుత్వ వైద్యంతో పాటు ప్రైవేట్ ఆస్పత్రులు, మార్కెట్ లోని మెడికల్ స్పోర్ట్స్ దగ్గర ఔషధాలు ఎలాంటి కొరత లేకుండా.. తగిన నిల్వలుండేలా చర్యలు తీసుకోవాలని ఔషధ నియంత్రణ సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆ సంస్థ మెడిసన్ తయారీదారులతో చర్చిస్తోంది.మరింత సమాచారం తెలుసుకోండి: