అగ్రరాజ్యం అమెరికాలో ఆహార సంక్షోభం నెలకొంది. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉందన్న పాత సామెత ఇప్పుడు అమెరికాకు బాగా సూట్ అవుతోంది. ఆహార ఉత్పత్తులు ఉన్నా, ప్రాసెసింగ్ చేసే దిక్కులేక సూపర్ మార్కెట్లు వెలవెలబోతున్నాయి. వినియోగదారులకు సమయానికి సరుకుల రవాణా లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. కొత్త వేరియంట్ ఓమిక్రాన్ తో అమెరికా గజగజ వణుకుతోంది. అక్కడ ఒక్క రోజులో లక్షల్లో కేసులు వెలుగుచూస్తున్నాయి. దీంతో అక్కడ ప్రజా జీవనం ఆహార వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

 నిత్యావసర వస్తువుల దుకాణాల్లో కార్మికులు అనారోగ్యానికి గురికావడంతో ఆహార వ్యవస్థ కుదేలవుతోంది. కరోనా వైరస్ మొదలైన నాటి నుండి వ్యవసాయ క్షేత్రాల నుండి తయారీదారులు, పంపిణీదారులు వరకు ఆహార వ్యవస్థలోని ప్రతి విభాగంలో కార్మికుల కొరత ఏర్పడుతోంది. దీంతో సూపర్ మార్కెట్ లు ఆహార పదార్థాలను పూర్తిస్థాయిలో నిల్వచేసేందుకు కష్టపడుతున్నాయి. ఓమిక్రాన్  తీవ్రరూపం దాల్చిన  నేపథ్యంలో కార్మికుల కొరత విపరీతంగా ఏర్పడింది. వైరస్ ఉదృతి నిలిచిపోయినా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆరోగ్య సమస్యలను పెంచుతుంది. విద్యాసంస్థలు మళ్ళీ మూత పడుతున్నాయి.వ్యవసాయ ఉత్పత్తుల ప్రొసెసింగ్ నిలిచిపోయింది.అనారోగ్యం కారణంగా అనేకమంది పనులకు దూరంగా ఉంటున్నారు.దీని వల్ల నిత్యావసర సరుకులు, ఇంధన ధరలు పెరిగిపోయాయి. సామాన్యులు కొనలేని పరిస్థితి ఏర్పడ్డాయి. ఓమిక్రాన్ కారణంగా కార్మికుల కొరత తీవ్రంగా ఉందని సప్లైజింగ్ కన్సల్టెన్స్ రేజిలింగ్ కార్ప్ సీఈఓ బిండియా వాకిల్ అన్నారు.

ఇటీవల కాలంలో పలు సూపర్ మార్కెట్ లలోని సిబ్బందిలో మూడు రెట్ల మంది కార్మికులు కరోనా బారిన పడ్డారని, 18 వేల మంది పనిచేస్తున్న ప్రాంతంలో కొన్ని వారాల్లో ఒక శాతం మంది వైరస్ బారిన పడ్డారని ఒక కిరాణా పంపిణీ సంస్థ పేర్కొంది. వినియోగదారులు ఆర్డర్లు చేసుకున్నప్పటికీ వాటిని పొందడంలో ఆలస్యం నెలకొందని తెలిపింది. అందుబాటులో ఉన్న ఉద్యోగులు అధిక గంటలు పని చేస్తున్నారని తెలిపింది. కార్మికుల కొరత కారణంగా సూపర్ మార్కెట్లలో, దుకాణాల్లో నిత్యవసర వస్తువులు అందుబాటులో ఉండటం లేదు. ఇటువంటి పరిస్థితి అమెరికా వ్యాప్తంగా  స్టోర్ లలో నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: