ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలని  అక్కడి వాసులు ఆరభించిన ఆమరావతి ఉద్యమం ప్రస్తుతం పక్కదారి పట్టిందా ? చాలా కాలం పాటు వివిధ రూపాల్లో తమ నిరసనను వ్యక్తం చేసిన అక్కడి వారు ప్రస్తుతం లక్ష్యం వదలి,  మరో పోరాయానికి సిద్ధం అయ్యారా ? ప్రస్తుత పరిణామాలు అవుననే అనిపిస్తున్నాయి. జస్ట్ ఓ లుక్
అమరావతి ప్రాంతాన్ని ఏకైక రాజధానిగా చేయాలని అక్కడి రైతులు ఉద్యమం చేశారు. వివిధ రూపాల్లో తమ నిరసనను ప్రభుత్వానికి,  ప్రపంచానికి తెలియజేశారు. చివరగా వారు  న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరిట చేసిన యాత్ర ఆశినంత మేర సఫలీకృతమైందనే చెప్పాలి. యాత్ర చివరి రోజుల్లో నెల్లూరు జిల్లా లో   ప్రవేశించినప్పుడు భారతీ జనతా పార్టీ బహిరంగంగా మద్దతు తెలిపింది.  యాత్ర ముగింపు సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన బహిరంగ సభ కూడా అనుకున్నంత మేర విజయం సాధించింది.  ఈ  కార్యాచరణ మూగిసే లోగానే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుంది.  అయితే మరో రూపం లో సభ ముందుకు మరో బిల్లు తీసుకువస్తామని ప్రభుత్వంలోని పెద్దలు ప్రకటించారు.ఇదంతా అందరికీ తెలిసిన విషయమే.
తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాజధాని పరిధిలోని 19 గ్రామాలతో అమరావతి క్యాపిటల్ సిటి మున్సిపల్ కార్పోరేషన్ ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. దీంతో అమరావతి ఉద్యమ రైతులు మరలా పోరుబాట పట్టారు. గత ప్రభుత్వం లో నిర్దేశించిన విధంగా 25 పంచాయతీల్లోని 29 గ్రామాలను అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పోరేషన్ లో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. అదిశగా అడుగులు వేస్తున్నారు. తుళ్లూరు మండలంలోని 16 గ్రామాలు, మంగళగిరి మండలంలోని మూడు పంచాయతీలను మాత్రం అమరావతి కార్పోరేషన్ లో కలపటాన్ని వారు నిరశిస్తున్నారు. కలిపితే అన్ని గ్రామాలను ఒకే చోట కలపాల్సందేనని పట్టుబడుతున్నారు.అమరావతి ఐకాస నేతలు ప్రజా చైతన్య యాత్రల పేరిట గ్రామాల్లో సదస్సులు నిర్వహిస్తున్నారు. దీంతో అమరావతి మాత్రమే ఆంధ్ర ప్రదేశ్ కు ఏకైక రాజధానిగా ఉండాలనే డిమాండ్ మరుగున పడి పోయి అన్ని గ్రామాలను అమరావతి క్యాపిటల్ సిటి మున్సిపల్ కార్పోరేషన్ లో కలపాలనే డిమాండ్ తెరమీదకు వచ్చింది. అలా అమరావతి రాజధాని ఉద్యమం పక్కదారిపట్టిందని  రాజకీయ పరిశీలకులు పేర్కోంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: