సిపిఎం జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. ఈ కార్యక్రమానికి  హైదరాబాద్ నగరం ఆతిథ్యం ఇచ్చింది. దాదాపు 23 తీర్మానాలను ఆమోదించినట్లు సమావేశం అనంతరం సిపిఎం నేతలు మీడియా తో  చెప్పారు. అంతవరకూ బాగానే ఉంది. మీ తదుపరి కార్యచరణ ఏమిటనే విషయం లో మాత్రం వారు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. వారు చెప్పుకొచ్చింది ఒకే ఒక అంశం. అదేమిటో తెలుసుకోవాలని ఉందా ?
దేశంలో భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తున్న వారితో కలసి రాజకీయ పోరాటం చేస్తామని ,అదే ప్రస్తుతం తమ అజెండా  అని సిపిఎం పార్టీ నేతులు పేర్కోన్నారు. హైదరాబాద్ సమీపంలోని కన్నూర్ వద్ద నాలుగు రోజుల పాటు జరిగినే  ఆ పార్టీ జాతీయ సమావేశాలు ఆదివారంతో ముగిశాయి. సమావేశాల అనంతరం ఆ పార్టీ నేతుల వీూడియాతో మాట్లాడారు. భారతీయ,జనతా పార్టీ విధానాలను వ్యతిరేకించే వారితోనే తాము కలసి నడుస్తామని ఆ పార్టీ సీనియర్ నేత సీతారం ఏచూరి తెలిపారు. పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలపై ఆయన మాట్లాడారు. దాదాపు 23 తీర్మానాలను సమావేశాల్లో ఆమోదించినట్లు తెలిపారు. దేశ రాజకీయాలలో ప్రత్యామ్నాయ కూటమి అనేది సహజంగా ఎన్నికల తరువాత ఏర్పడుతుందని ఏచూరి అభిప్రాయ పడ్డారు. రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఓటమికి కమ్యూనిస్టులు కృషి చేస్తారని తెలిపారు. ప్రధాని  పంజాబ్ పర్యటనలో సెక్యూరిటీ ల్యాప్సిస్ ఉంటే వెంటనే  చర్యలు తీసుకోవాలని సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. తెలంగాణ మఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు తో కమ్యూనిస్టు నేతల సమావేశంపై సీతారాం ఏచూరి ఆచితూచి స్పందించారు. కెసిఆర్ కొన్ని అంశాలలో మాత్రమే బిజేపిని వ్యతిరేకిస్తున్నారని ఆయన తెలిపారు. భారత్ లో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. బిజేపి ప్రత్యామ్నాయం ఎవరు అనే విషయం ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాత తెలుస్తుందన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన పొత్తులు అన్నీ కూడా ఎక్కడికక్కడ, స్థానిక నేతలు నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. ప్రతి చోటా కామన్ గా భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించే వారితోనే పొత్తులుంటాయని , అదే తమ ప్రస్తుత అజెండా అని స్పష్టం చేశారు .


మరింత సమాచారం తెలుసుకోండి:

cpm